OYO New Rule : ఓయో హోటల్స్ షాకింగ్ నిర్ణయం.. వాళ్లకు నో బుకింగ్స్
పెళ్లి కాని జంటలకు(OYO New Rule) హోటల్ రూమ్స్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఇక కల్పించలేమని వెల్లడించింది.
- By Pasha Published Date - 01:06 PM, Sun - 5 January 25

OYO New Rule : దేశవ్యాప్తంగా ఓయో హోటల్ రూమ్స్ బుకింగ్స్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ప్రజలు వాటిని తెగ వాడేస్తున్నారు. ప్రత్యేకించి న్యూ ఇయర్ వేళ ఓయో హోటల్స్ బిజీ అయ్యాయి. అయితే ఓయో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ అనుబంధ హోటల్స్‌లో రూమ్స్ బుక్ చేసుకునే వారికి సంబంధించి ఒక కొత్త రూల్‌ను ఓయో ప్రవేశపెట్టింది. పెళ్లి కాని జంటలకు(OYO New Rule) హోటల్ రూమ్స్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఇక కల్పించలేమని వెల్లడించింది.
Also Read :Isckon Employee Fled : రూ.లక్షల విరాళాలతో బిచాణా ఎత్తేసిన ఇస్కాన్ ఉద్యోగి
అయితే ప్రస్తుతానికి ఈ నిబంధనను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరం పరిధిలో ఉన్న ఓయో హోటల్స్‌లో సత్వరం అమల్లోకి తెచ్చారు. ఎవరైనా జంటలు అక్కడి హోటల్స్‌కు వెళితే.. వారిద్దరి రిలేషన్‌షిప్ గురించి ధ్రువీకరణ చేసే అధికారిక డాక్యుమెంట్లను సమర్పించాలి. పెళ్లయిన జంటలు, తోబుట్టువులు, ఇతర రక్త సంబంధీకుల జంటలకు మాత్రమే హోటల్ రూమ్స్‌ను కేటాయిస్తారు. గ్రౌండ్ లెవల్ నుంచి తమకు అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ మేరకు రూల్‌ను మార్చామని ఓయో అధికార వర్గాలు చెబుతున్నాయి. తదుపరి విడతల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఓయో హోటల్స్‌లోనూ ఇదే రూల్‌ను ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని చెప్పారు. మీరట్‌లోని ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని ఈమేరకు రూల్‌ను మార్చామని ఓయో అధికార వర్గాలు తెలిపాయి.
Also Read :Polished Rice : డబుల్ పాలిష్డ్ బియ్యం వాడుతున్నారా ? బీ అలర్ట్ ‘బెరిబెరి’!
దేశంలోని పలు ఇతర నగరాల నుంచి కూడా ఇలాంటి విన్నపాలే తమకు అందాయన్నారు. వాటిని ప్రస్తుతం తమ కంపెనీ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. పెళ్లి కాని జంటల వివాహేతర సంబంధాలకు ఓయో హోటల్ రూమ్స్ అడ్డాలుగా మారుతున్నాయనే ప్రచారం ఉంది. ఈ నెగెటివ్ రిమార్కును దూరం చేసుకునే క్రమంలోనే ఇప్పుడు ఓయో కంపెనీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కూడా సవరించిన ఈ నిబంధనను అమలు చేయాలనే గళం వినిపిస్తోంది. కుటుంబాలు, వ్యాపార వర్గాలు, మత సంస్థల కార్యక్రమాలు, ప్రయాణికుల వసతి వంటి వాటికి వేదికలుగా ఓయో హోటల్ రూమ్స్ మారాలంటే నైతిక నియమావళి ప్రకారం వాటి నిర్వహణ జరిగేలా చూడాలి.