Iran-Israel War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి నేపథ్యంలో ఆసియా స్టాక్స్ పతనం, పెరిగిన గోల్డ్, ఆయిల్
ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో భౌగోళికంగా ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఆసియాలో ఈ ప్రభావం కనిపిస్తుంది. ఈ దాడి నేపథ్యంలో సోమవారం ఆసియా స్టాక్‌లు భారీగా పడిపోయాయి.
- Author : Praveen Aluthuru
Date : 15-04-2024 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
Iran-Israel War: ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో భౌగోళికంగా ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఆసియాలో ఈ ప్రభావం కనిపిస్తుంది. ఈ దాడి నేపథ్యంలో సోమవారం ఆసియా స్టాక్‌లు భారీగా పడిపోయాయి. జపాన్, దక్షిణ కొరియా మరియు ఆస్ట్రేలియాలో ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు క్షీణించగా, హాంకాంగ్ స్టాక్ ఫ్యూచర్లు కూడా పడిపోయాయి. అటు బంగారం ధరల తో పాటు ఆయిల్ ధరలు పెరిగాయి.
ఉదయం ట్రేడింగ్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 225, దక్షిణ కొరియా కోస్పి రెండూ 1% కంటే ఎక్కువ పడిపోయాయి . హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 0.8 శాతం పడిపోయింది. కానీ చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.2% పెరిగింది. స్పాట్ గోల్డ్ సోమవారం 0.6% పెరిగి ఔన్సుకు 2,358 డాలర్ల వద్ద ఉంది. కాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయవచ్చనే ముందే గ్రహించిన కారణంగా శుక్రవారం నాడు ఔన్స్‌కి 2,431 డాలర్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు బులియన్ 18% పెరిగింది.
We’re now on WhatsApp. Click to Join
ఇరాన్ నుండి ప్రతీకార చర్యను ఊహించి చమురు ధరలు శుక్రవారం అధిక స్థాయిలో స్థిరపడ్డాయి. ఇది అక్టోబర్ నుండి అత్యధిక స్థాయిలను తాకింది. కాగా ఇజ్రాయెల్ సైనిక అధికారుల ప్రకారం.. దాడి స్వల్ప నష్టాన్ని మాత్రమే కలిగించిన ప్రభావం భౌగోళికంగా నష్టాన్ని మిగిల్చిందని అభిప్రాయపడ్డారు.ఈ సంవత్సరం అమెరికా క్రూడ్ ఫ్యూచర్స్ 6.7% పెరిగాయి. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 10% కంటే ఎక్కువ పెరిగింది.
ఈ నెల ప్రారంభంలో సిరియాలోని ఇరాన్ దౌత్య కాంప్లెక్స్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్ దాడి చేస్తుందని ముందునుంచి ఉహిస్తున్నదే. ఊహించబడింది.
Also Read: Lok Sabha polls : మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం