Roshni Jackpot : ‘టాప్-10’ నుంచి అంబానీ ఔట్, రోష్ని ఇన్.. ప్రపంచ, భారత సంపన్నులు వీరే
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Roshni Jackpot) సంపద 82 శాతం పెరిగి 420 బిలియన్ డాలర్లకు చేరింది. నంబర్ 1 సంపన్నుడి ర్యాంక్ ఆయనదే.
- By Pasha Published Date - 03:50 PM, Thu - 27 March 25

Roshni Jackpot : గత కొన్నేళ్లుగా విడుదలైన హురున్ గ్లోబల్ టాప్-10 ప్రపంచ సంపన్నుల లిస్టులో ముకేశ్ అంబానీ పేరు వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆయనకు ఆ ఛాన్స్ దక్కలేదు. కానీ హెచ్‌సీఎల్ అధినేత శివ్‌నాడార్ కుమార్తె రోష్ని నాడార్‌కు విశేష గుర్తింపు లభించింది. ఏకంగా రూ.3.5 లక్షల కోట్ల సంపదతో టాప్-10 ప్రపంచ సంపన్న మహిళల జాబితాలో 5వ స్థానాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. తండ్రి నుంచి ఇటీవలే రోష్ని నాడార్‌కు హెచ్‌సీఎల్‌లో 47శాతం వాటా వచ్చింది. దీంతో ఆమె నెట్ వర్త్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ముకేశ్ అంబానీకి సవాళ్లు ఇవీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఇంధన, రిటైల్ వ్యాపారాలు ఇటీవలి కాలంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావం రిలయన్స్ గ్రూపుపై పడింది. ఆ రెండు వ్యాపార విభాగాల్లో అమ్మకాలు కొంతమేర తగ్గాయి. అప్పుల భారం పెరిగింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారంలోని డిజిటల్ విభాగాలు అంతగా రాణించలేకపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు టెలికాం రంగానికి ముకేశ్ అంబానీ కేటాయింపులను పెంచారు. అయితే ఈ పెట్టుబడులు దీర్ఘకాలిక వ్యూహంతో కూడుకున్నవి. వాటి నుంచి ప్రతిఫలాలను ఆర్జించేందుకు సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో అప్పులు పెరగడంతో ముకేశ్ అంబానీ సంపద రూ.లక్ష కోట్లు క్షీణించినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ వెరసి ప్రస్తుతానికి ముకేశ్ అంబానీ నెట్ వర్త్ కొంతమేర తగ్గింది. దీంతో ఆయనకు టాప్-10 సంపన్నుల జాబితాలో చోటు దక్కలేదు.
టాప్-10 ప్రపంచ సంపన్నులు వీరే..
- టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Roshni Jackpot) సంపద 82 శాతం పెరిగి 420 బిలియన్ డాలర్లకు చేరింది. నంబర్ 1 సంపన్నుడి ర్యాంక్ ఆయనదే.
- అమెజాన్ అధిపతి జెఫ్‌బెజోస్ రెండో స్థానంలో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద 266 బిలియన్ డాలర్లు.
- మెటా (ఫేస్‌బుక్) సీఈవో జుకర్‌బర్గ్ మూడో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద 242 బిలియన్ డాలర్లు.
- నాలుగో స్థానంలో ఒరాకిల్ సీఈవో లారీ ఎల్లిసన్ ఉన్నారు.
- ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఐదో స్థానంలో ఉన్నారు.
- గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ ఆరో స్థానంలో ఉన్నారు.
- ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ కింగ్, LVMH కంపెనీ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ ఏడో స్థానంలో నిలిచారు.
- మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బామర్ 8వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ షేర్ల ధరలు పెరగడంతో ఆయన సంపద 10 శాతం పెరిగి 156 బిలియన్ డాలర్లకు చేరింది.
- గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ సంపద 30 శాతం పెరిగి 148 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆయనకు 9వ స్థానం లభించింది.
- బిల్‌గేట్స్ సంపద స్వల్పంగా 4 శాతం పెరిగి 143 బిలియన్ డాలర్లకు చేరింది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో తన వాటాను గేట్స్ 1 శాతం మేర తగ్గించుకున్నారు.
Also Read :Pig Liver : తొలిసారిగా మనిషికి పంది కాలేయం.. ఎందుకు ?
టాప్-10 భారత సంపన్నులు వీరే..
- భారత సంపన్నుల జాబితాలో నంబర్ 1 స్థానంలో ముఖేశ్ అంబానీ నిలిచారు. ఆయన సంపద 13 శాతం తగ్గినా రూ.8.6 లక్షల కోట్లుగా ఉంది.
- గౌతమ్ అదానీ కుటుంబం సంపద – రూ.8.4 లక్షల కోట్లు.
- రోష్ని నాడార్ కుటుంబం సంపద – రూ.3.5లక్షల కోట్లు.
- దిలీప్ సంఘ్వీ కుటుంబం సంపద – రూ.2.5 లక్షల కోట్లు.
- అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం సంపద – రూ.2.2 లక్షల కోట్లు.
- కుమార మంగళం బిర్లా కుటుంబం సంపద – రూ.2.0లక్షల కోట్లు
- సైరస్ పూనావాలా కుటుంబం సంపద – రూ.2.0లక్షల కోట్లు.
- నీరజ్ బజాజ్ ఫ్యామిలీ సంపద – రూ.1.6 లక్షల కోట్లు.
- రవి జైపురియా కుటుంబం సంపద – రూ.1.4 లక్షల కోట్లు.
- రాధా కిషన్ దమానీ కుటుంబం సంపద – రూ.1.4లక్షల కోట్లు.