Satya Nadella Net Worth: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంపాదన ఎంతో తెలుసా..?
టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో ఏర్పడిన లోపం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ సమస్యపై సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella Net Worth) స్పందన కూడా వెలుగులోకి వచ్చింది.
- Author : Gopichand
Date : 20-07-2024 - 9:54 IST
Published By : Hashtagu Telugu Desk
Satya Nadella Net Worth: టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో ఏర్పడిన లోపం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ సమస్యపై సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella Net Worth) స్పందన కూడా వెలుగులోకి వచ్చింది. Xలో ఈ సమస్య గురించి మాకు తెలుసు, వినియోగదారులు తమ సిస్టమ్‌లను సురక్షితంగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడంలో సహాయపడటానికి CrowdStrikeకి సాంకేతిక మద్దతును అందిస్తున్నామని నాదెళ్ల చెప్పారు.
మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన కంపెనీ. కంపెనీ మార్కెట్ క్యాప్ గురించి మాట్లాడినట్లయితే.. ఇది 3.272 ట్రిలియన్ డాలర్లు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారతీయ సంతతికి చెందినవారు. 2014లో కంపెనీకి సీఈవో అయ్యారు. మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు కంపెనీ అనేక సమస్యలతో సతమతమైంది. సంస్థను ఉన్నత స్థితికి తీసుకెళ్లిన వ్యక్తి సత్య నాదెళ్ల.
Also Read: Age Vs Sleep : ఏ వయసు వారు.. రోజూ ఎంతసేపు నిద్రపోవాలో తెలుసా ?
సత్య నాదెళ్ల సంపాదన ఎంత?
మీడియా కథనాల ప్రకారం.. సత్య నాదెళ్ల నికర విలువ దాదాపు రూ.7,500 కోట్లు. 2023 ఆర్థిక సంవత్సరంలో నాదెళ్ల జీతం 4.85 కోట్ల డాలర్లు అంటే 4 బిలియన్ల 3 కోట్ల 64 లక్షల 63 వేల 425 రూపాయలు. ఇందులో నాదెళ్ల బేసిక్ వేతనం 25 లక్షల డాలర్లు కాగా, బోనస్ 64 లక్షల డాలర్లకు పైగా ఉంది. ప్రొఫెషనల్ సోషల్ నెట్‌వర్క్ లింక్డ్‌ఇన్ CEO అయిన ర్యాన్ రోస్లాన్స్కీతో సంభాషణ సందర్భంగా నాదెళ్ల మాట్లాడుతూ తనకు 1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చిందని, ఆ కంపెనీలో యువ ఇంజనీర్‌గా చేరినప్పుడు.. ఏదో ఒకరోజు తాను కూడా సీఈఓ అవుతానని ఊహించలేదని చెప్పాడు. కానీ ఇప్పుడు అదే కంపెనీకి నాదెళ్ల సీఈవోగా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇకపోతే భారతదేశం, ఆస్ట్రేలియా, జర్మనీ, USA, UK సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ ల్యాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ సమస్యతో ఇబ్బంది పడ్డారు. వారి సిస్టమ్‌లు ఆటోమేటిక్‌గా ఆగిపోయాయి. అదే పద్ధతిలో పునఃప్రారంభమయ్యాయి. డెల్ టెక్నాలజీ వంటి సంస్థల ప్రకారం.. ఇటీవలి క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ క్రాష్ జరిగింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ఈ లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్, ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్, అల్లెజియంట్, బ్యాంకులు, రైల్వేల మీద ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే.