Kisan Vikas Patra: పోస్టాఫీసులో ఈ ఖాతా గురించి తెలుసా..? పెట్టిన పెట్టుబడికి రెండింతలు రాబడి..!
మీరు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం మంచి ప్రభుత్వ పథకం గురించి ఆలోచిస్తుంటే కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra) మంచి ఎంపిక.
- By Gopichand Published Date - 10:30 AM, Thu - 11 July 24

Kisan Vikas Patra: దీర్ఘకాలిక పెట్టుబడి ఎల్లప్పుడూ మంచి ఎంపికగా పరిగణించబడుతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి మంచి రాబడి వస్తుంది. మీరు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం మంచి ప్రభుత్వ పథకం గురించి ఆలోచిస్తుంటే కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra) మంచి ఎంపిక. దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మొత్తాన్ని రెట్టింపు చేయవచ్చు. ఇది పోస్టాఫీసు పథకం.. అంటే దీని ప్రయోజనాలను పొందాలంటే పోస్టాఫీసులో ఖాతా తెరవాలి.
ఎవరు ఖాతాను తెరవగలరు..?
ఈ పథకం 1988లో ప్రారంభమైంది. మొదట్లో ఈ పథకం కేవలం రైతులకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో ఖాతా తెరవవచ్చు. ఈ పథకం కింద సింగిల్ లేదా జాయింట్ ఖాతా తెరవవచ్చు. పిల్లల వయస్సు 10 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య ఉంటే వారి పేరు మీద కూడా KVP పథకంలో ఖాతాను తెరవవచ్చు. అయితే, అలాంటి పిల్లల ఖాతాలను నిర్వహించడం తల్లిదండ్రుల బాధ్యత. 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత వ్యక్తి స్వయంగా ఖాతాను నిర్వహించవచ్చు.
Also Read: UK MP Shivani Raja: వీడియో.. భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన శివానీ రాజా
ఈ ఖాతా వల్ల ఏం లాభం..?
- ప్రస్తుతం ఈ పథకంపై 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. అయితే ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి లెక్కిస్తారు. ఇటువంటి పరిస్థితిలోమార్పు ఉండవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఏదైనా మార్పు వస్తే అక్టోబరు నుంచి జరుగుతుంది.
- ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు స్థిర వడ్డీ ప్రకారం రాబడిని పొందుతారు. ఇటువంటి పరిస్థితిలో మార్కెట్ హెచ్చుతగ్గులు దానికి ఎటువంటి తేడాను కలిగి ఉండవు. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ ఫ్రీ అని చెప్పొచ్చు.
- ఇందులో మీరు వెయ్యి రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. అయితే రూ.50 వేల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే పాన్ కార్డు అందించాల్సి ఉంటుంది. మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే మీరు జీతం స్లిప్, ఐటీఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్ తదితరాలను అందించాల్సి ఉంటుంది.
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు పొందడం ఎలా?
ఈ పథకం యొక్క మెచ్యూరిటీ వ్యవధి 115 నెలలు (9 సంవత్సరాల 7 నెలలు). ఇందులో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 115 నెలల తర్వాత ఈ మొత్తం రెట్టింపు అవుతుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన రూ.5 లక్షలు రూ.10 లక్షలు అవుతుంది. దీని లాకిన్ పీరియడ్ 30 నెలలు. మీరు ఈ సమయానికి ముందు మొత్తాన్ని విత్‌డ్రా చేయలేరు. దీని తర్వాత మీరు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. 30 నెలల తర్వాత మీరు ఎప్పుడైనా మొత్తాన్ని ఉపసంహరించుకున్నప్పుడు ఆ కాలానికి వడ్డీని వర్తింపజేసిన తర్వాత మీరు మొత్తాన్ని పొందుతారు. ఈ పథకంలో పెట్టుబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80C ప్రయోజనం అందుబాటులో ఉండదు.
We’re now on WhatsApp. Click to Join.