HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Itr Filing Due Date What Is The Last Date To File Itr

ITR Filing Due Date: ఐటీఆర్ ఫైల్ చేయ‌నివారికి మ‌రో ఛాన్స్‌.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈసారి గడువును కేవలం ఒక రోజు మాత్రమే పొడిగించి సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 16కు మార్చారు.

  • Author : Gopichand Date : 16-09-2025 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ITR Refund 2025
ITR Refund 2025

ITR Filing Due Date: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Filing Due Date) దాఖలు చేయడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పోర్టల్ లాగిన్ అవ్వట్లేదు. స్క్రీన్ ఫ్రీజ్ అవుతోంది. తరచుగా హ్యాంగ్, లాగౌట్ అవుతోంది. కొన్నిచోట్ల సర్వర్ డౌన్ సమస్య కూడా ఉంది. దీని కారణంగా ఇప్పటికే ఐటీఆర్ దాఖలు గడువు ఒక రోజు పొడిగించారు. మరి భవిష్యత్తులో కూడా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు పొడిగిస్తారా? ఎందుకంటే ఐటీఆర్ దాఖలు చేయకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది.

లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయలేరు

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈసారి గడువును కేవలం ఒక రోజు మాత్రమే పొడిగించి సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 16కు మార్చారు. ఐటీఆర్ దాఖలు చివరి రోజున ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై అధిక ట్రాఫిక్, సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ లాగిన్ చేయడానికి, డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని నింపడానికి, సేకరించడానికి, అప్‌లోడ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఐటీఆర్ దాఖలు చేయడానికి ఒక రోజు సమయం సరిపోదు.

Also Read: Delhi Government: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీ.. 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గింపు!!

ఐటీఆర్ గడువు పొడిగిస్తే ఆదా అవుతుంది

క్లియర్‌ట్యాక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అర్చిత్ గుప్తా మాట్లాడుతూ.. ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తే, పన్ను చెల్లింపుదారులకు రూ. 5000 వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఇంకా 1.5 నుండి 2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉందని అంచనా. అయితే ఒక రోజు గడువు పొడిగింపును ఆలస్యంగా చేశారు. అర్ధరాత్రి గడువు పొడిగించినట్లు ప్రకటించారు. అప్పటికి చాలామంది నిద్రపోయారు. వారికి మరుసటి రోజు ఉదయం మాత్రమే గడువు పెరిగిన విషయం తెలిసింది. ఆ తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా సమయం పట్టింది. చివరి రోజులో సగం సమయం తయారీకే సరిపోయిందని, దీనికి తోడు సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • Income Tax Return
  • ITR Filing Deadline
  • ITR Filing Due Date
  • ITR News

Related News

Silver runs surpassing gold.. Center exercises on hallmarking

బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు

పెట్టుబడుల కోసం, ఆభరణాల వినియోగం కోసం వెండిపై ప్రజల ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో మోసాల ముప్పు కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాల రక్షణ కోసం వెండికీ బంగారం తరహాలోనే తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలు చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ప్రారంభించింది.

  • Budget 2026

    కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం?

  • E-passport

    భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

  • Aadhaar Updates

    ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

  • Bondada Engineering Wins ₹627 Cr APTRANSCO BESS Order

    బొండాడ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌.. ఏపీ ట్రాన్స్‌కో నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది..!

Latest News

  • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

  • టైఫాయిడ్ జ్వ‌రం ఇంకా భ‌యంక‌రంగా మార‌నుందా?

  • వీపీఎన్ సేవ‌ల‌పై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం నిషేధం!

  • పొదుపు సంఘాల వారికీ చంద్రబాబు తీపికబురు

  • లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!

Trending News

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

    • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd