Stock market: ‘ట్రంప్’ సుంకాలకు భయపడని ఇన్వెస్టర్లు ..ఫుల్ జోష్ లో సెన్సెక్స్
Stock market: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపించి అదనంగా 25 శాతం సుంకాలు విధించడంతో ఈరోజు మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే, ట్రేడింగ్ ముగిసే సమయానికి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు పుంజుకుని, నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి.
- By Sudheer Published Date - 06:38 PM, Thu - 7 August 25

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) భారత్‌పై 50 శాతం సుంకాలు (Tariffs) విధిస్తామని హెచ్చరించినా, భారత స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు (Investors) దానిని పెద్దగా పట్టించుకోలేదు. ట్రంప్ సుంకాల బాదుడును లెక్క చేయకుండా కొనుగోళ్లు చేపట్టడంతో గురువారం స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపించి అదనంగా 25 శాతం సుంకాలు విధించడంతో ఈరోజు మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే, ట్రేడింగ్ ముగిసే సమయానికి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు పుంజుకుని, నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల్లోని షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి.
ట్రంప్ సుంకాల పెంపు అనేది భారత్‌తో వాణిజ్య ఒప్పందంలో పైచేయి సాధించడానికే అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా-భారత్ మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్ల భయాన్ని తగ్గించాయి. వీటికి తోడు, భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసం కూడా సూచీలు పెరిగేందుకు దోహదపడింది. ఈ కారణంగా, రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గురువారం ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి సెన్సెక్స్ 812 పాయింట్లు పుంజుకుంది.
Mukesh Ambani: ముకేష్ అంబానీ సరికొత్త రికార్డు.. ఐదవ సంవత్సరం కూడా నో శాలరీ!
గురువారం ఉదయం ట్రంప్ సుంకాల భయాలతో సెన్సెక్స్ సూచీ 80,262.98 వద్ద నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒకానొక సమయంలో 79,811.29 వద్ద కనిష్ఠ స్థాయికి పడిపోయినప్పటికీ, మార్కెట్లు ముగిసే సమయానికి 7927 పాయింట్ల లాభంతో 80,623 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 21.95 పాయింట్లు లాభపడి 24,596.15 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 87.69 వద్ద కనిష్ఠ స్థాయిల్లో ఉంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ వంటి కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి.