Fake GST Bills : ఫేక్ జీఎస్టీ బిల్లులతో మాయ.. వాటిని ఇలా గుర్తించండి
ఇంతకీ ఫేక్ జీఎస్టీ బిల్లులను(Fake GST Bills) ఎలా గుర్తించాలి ?
- By Pasha Published Date - 05:11 PM, Thu - 22 August 24

Fake GST Bills : పన్ను ఎగవేతలను అరికట్టడమే జీఎస్టీ విధానం లక్ష్యం. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నకిలీ జీఎస్టీ బిల్లులతో మోసాలకు తెగబడుతున్నారు. పన్నును ఎగవేస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తున్నారు. ఇంతకీ ఫేక్ జీఎస్టీ బిల్లులను(Fake GST Bills) ఎలా గుర్తించాలి ? అనేది ఈ కథనంలో మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
కొన్ని హోటళ్లు, షోరూమ్‌లు, దుకాణాల నిర్వాహకులు నకిలీ జీఎస్టీ బిల్లులను ఇస్తున్నట్లు ఇటీవల పలుచోట్ల వెలుగులోకి వచ్చింది. అలాంటివి గుర్తించాలంటే మనకు వాటిపై కనీస అవగాహన ఉండాలి. ఆ పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
- జీఎస్టీ బిల్లును చేతిలోకి తీసుకోగానే తొలుత మనం దానిపై ఉండే GSTIN నంబరును చూడాలి. అది 15 అంకెలలో ఉంటుంది. ఇందులో స్టేట్ కోడ్, సరఫరాదారుడి పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటాయి. GSTIN నంబరును జీఎస్టీ పోర్టల్‌లో మనం ఎంటర్ చేయగానే.. అందులో పన్ను చెల్లింపుదారు రకం, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ స్థానం (రాష్ట్రం), చట్టపరమైన పేరు, వ్యాపారం, వాణిజ్యం పేరు, GSTIN స్టేటస్ అన్నీ మనకు కనిపిస్తాయి. వాటిని బట్టి అది అసలుదా ? నకిలీదా ? తెలుసుకోవచ్చు.
- జీఎస్టీ బిల్లులోని ఇన్ వాయిస్ నంబర్, తేదీలను తప్పకుండా చూడాలి. ఇన్వాయిస్ నంబర్ యూనిక్‌గా ఉండాలి. వస్తు, సేవలను కొన్న టైమ్ కూడా దానిలో ఉంటుంది. ఇవన్నీ లేకుంటే ఆ బిల్లు ఫేక్.
Also Read :DNA Report : వైద్యురాలిపై అఘాయిత్యం కేసు.. కీలకంగా డీఎన్ఏ రిపోర్టు
- జీఎస్టీ బిల్లులో సదరు వస్తు సేవలపై విధించిన పన్ను ఎంత అనే సమాచారం స్పష్టంగా ఉంటుంది. జీఎస్టీ వెబ్‌సైట్‌లోని కాలిక్యులేటర్ ఓపెన్ చేసి, ఇన్వాయిస్లోని డబ్బులకు సరిపడా జీఎస్టీ వేశారా.. లేదా.. అనేది చెక్ చేసుకోవాలి.
- జీఎస్టీ బిల్లుపై సదరు వస్తు, సేవలను అందించే సప్లయర్ లేదా డీలర్ సంతకం ఉండాలి. బిల్లుపై కనిపించే సంతకం జీఎస్టీ పోర్టల్‌లో ఉన్న సంతకం సేమ్ ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి.
- జీఎస్టీ పోర్టల్‌లోకి వెళ్లి సదరు వస్తు,సేవలను మనకు అందించిన సప్లయర్‌కు సంబంధించిన టాక్స్ పేమెంట్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు. జీఎస్టీ పోర్టల్‌లో సప్లయర్ వివరాలు కనిపించకుంటే అతడి బిల్లు ఫేక్ అని అర్థం చేసుకోవాలి.
- ఫేక్ జీఎస్టీ బిల్లును ఎక్కడైనా గుర్తిస్తే జీఎస్టీ పోర్టల్‌లో మీరు కంప్లయింట్ పెట్టొచ్చు. దానిలో ఒక టోల్ -ఫ్రీ నంబరు ఉంటుంది. దానికి కాల్ చేసి వివరాలు చెప్పొచ్చు.