Cristiano Ronaldo : రొనాల్డోకు ‘గోల్డెన్ ప్లే’ బటన్.. 12 గంటల్లోనే 1.30 కోట్ల సబ్‌స్క్రయిబర్లు
యూట్యూబ్ గోల్డెన్ ప్లే బటన్ రావడం అంత ఈజీ కాదు. 1 మిలియన్ సబ్ స్క్రైబర్ల కోసం యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు చాలా ఏళ్లు కష్టపడతారు.
- By Pasha Published Date - 02:41 PM, Thu - 22 August 24

Cristiano Ronaldo : యూట్యూబ్ యుగం ఇది. ఈ సోషల్ మీడియా సంచలనంలోకి ఇప్పుడు ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కూడా అడుగుపెట్టారు. ఆయన యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసిన 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు వచ్చారు. కేవలం తొలి 12 గంటల్లోనే దాదాపు 1.30 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లను రొనాల్డో పొందారు. ఈ ఛానల్‌లో రొనాల్డో ఇప్పటివరకు కేవలం 19 వీడియోలను మాత్రమే పోస్ట్ చేశారు. అయినా ఇంత భారీ రేంజులో సబ్‌స్క్రయిబర్లు వచ్చి చేరారంటే.. రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఘనత సాధించిన నేపథ్యంలో 39 ఏళ్ల రొనాల్డోకు(Cristiano Ronaldo) యూట్యూబ్ ‘గోల్డెన్ ప్లే’ బటన్‌ను ప్రదానం చేసింది. దాన్ని తన ఫ్యాన్స్‌కు చూపిస్తూ ఆయన హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ గోల్డెన్ ప్లే బటన్ రావడం అంత ఈజీ కాదు. 1 మిలియన్ సబ్‌స్క్రయిబర్ల కోసం యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు చాలా ఏళ్లు కష్టపడతారు. ఆ తర్వాతే ఆ బటన్ వస్తుంది. కానీ రొనాల్డో కేవలం కొన్ని గంటల్లోనే ఈ రికార్డును సొంతం చేసుకొని తానేంటో ఇంటర్నెట్ ప్రపంచానికి చాటిచెప్పాడు.రొనాల్డోకు ‘ఎక్స్’లో 11కోట్లకుపైగా ఫాలోయర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 63.6 కోట్ల మంది ఫాలోయర్లను రొనాల్డో కలిగి ఉన్నారు.
Also Read :YouTube Account Hack : యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయితే రికవర్ చేసే ఏఐ టూల్
అంతకుముందు రొనాల్డో తన సోషల్ మీడియా ఛానళ్ల హ్యాండిల్స్ ద్వారా తన కొత్త యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం తాలూకు సమాచారాన్ని ప్రకటించాడు. “నిరీక్షణ ముగిసింది. నా YouTube ఛానెల్ వచ్చేసింది. ఈ కొత్త ప్రయాణంలో నా యూట్యూబ్ ఛానల్ పేరు UR Cristiano. మీరంతా దీన్ని సబ్‌స్క్రయిబ్ చేసుకోండి. నాతో చేరండి” అని రొనాల్డో పిలుపునిచ్చాడు. ఈ పిలుపు వినగానే ఆయన ఫ్యాన్స్ అంతా క్రేజీగా దాన్ని సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. అందుకే ఆయన ఈ ఘనతను సాధించగలిగారు.