Credit Report : క్రెడిట్ రిపోర్టులో తప్పుడు సమాచారం ఉందా ? ఇలా తీసేయండి
మనం లోన్ పొందాలన్నా.. క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా.. మంచి క్రెడిట్ స్కోరును కలిగి ఉండటం తప్పనిసరి.
- By Pasha Published Date - 01:28 PM, Thu - 11 July 24

Credit Report : మనం లోన్ పొందాలన్నా.. క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా.. మంచి క్రెడిట్ స్కోరును కలిగి ఉండటం తప్పనిసరి. చాలామంది మంచి క్రెడిట్ స్కోరు కోసం లోన్స్‌ను, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో కట్టేస్తుంటారు. అయితే ఒక్కోసారి కొంతమందికి షాకింగ్ పరిణామాలు ఎదురవుతుంటాయి. క్రెడిట్ బ్యూరోలు అవి రూపొందించే క్రెడిట్ రిపోర్టులో తప్పుడు సమాచారాన్ని రిపోర్ట్ చేస్తుంటాయి. ఈ తప్పుడు సమాచారం మన క్రెడిట్ స్కోరును తగ్గిస్తుంది. అలా జరగకూడదంటే మనం అలర్ట్ కావాలి. ఆ తప్పుడు సమాచారంపై సంబంధిత క్రెడిట్ బ్యూరోకు(Credit Report) కంప్లయింట్ చేయాలి. సమాచారాన్ని సరిదిద్దుకోవాలి. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
- మన దేశంలో ప్రధానంగా మూడు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. అవి.. సిబిల్ (CIBIL), ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్.
- మన క్రెడిట్ హిస్టరీని మదింపు చేసి.. లావాదేవీలు, ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన నివేదికలను క్రెడిట్ బ్యూరోలు తయారు చేస్తుంటాయి.
- లోన్ లేదా క్రెడిట్ కార్డు బిల్లును మనం సకాలంలోనే చెల్లించినా.. ఏదైనా క్రెడిట్ బ్యూరో రిపోర్టులో ‘లేట్ పేమెంట్’ కేటగిరీలో(Late Payment Record) చూపిస్తే మనం ఫిర్యాదు చేయొచ్చు.
- ఏరోజున, ఏ టైంలో మనం రీపేమెంట్ చేశాం అనే వివరాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ అంశాలకు బలం చేకూర్చేలా ఉండేందుకు బ్యాంకు స్టేట్మెంట్, బ్యాంకు లోన్ స్టేట్మెంట్, క్రెడిట్ కార్డు బిల్లు స్టేట్మెంట్ వంటివన్నీ జతపర్చాలి. ఇవన్నీ కలిపి సంబంధిత క్రెడిట్ బ్యూరోకు కంప్లయింట్‌ను పంపాలి.
- మన కంప్లయింటును క్రెడిట్ బ్యూరో పరిశీలించి.. క్రెడిట్ రిపోర్టులో తప్పుడు సమాచారం ఉంటే దాన్ని తొలగించి, సరైన సమాచారాన్ని చేరుస్తుంది.
- గతంలో ఎవరైనా లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లులు లేటుగా కట్టి ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనీసం ఇకపై పేమెంట్స్ సకాలంలో చేస్తే.. మన క్రెడిట్ స్కోరు పెరిగిపోతుంది.
- ఆర్థిక క్రమశిక్షణను పాటించే వారు అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. దానివల్ల వారు సకాలంలో బిల్స్ కట్టేస్తారు.
- ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వారు కనీసం ఏడాదికి ఒకసారి తమ క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకుంటారు. అందులోని తప్పులను సరి చేయించుకుంటారు.