HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >How Much Loan Will Be Given On 10 Grams Of Gold In The Bank

బ్యాంకులో 10 గ్రాముల బంగారంపై ఎంత రుణం ఇస్తారు?

  • Author : Vamsi Chowdary Korata Date : 17-02-2026 - 9:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Rate
Gold Rate

Gold Loan:  ప్రస్తుత బంగారం ధరలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 10 గ్రాముల బంగారంపై రూ.1 లక్ష నుంచి రూ.1.30 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకులు బంగారం విలువలో 75 శాతం నుంచి 85 శాతం వరకు లోన్(LTV) ఇస్తుంటాయి. బ్యాంకుల్లో ప్రస్తుతం గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 8.5 శాతం నుంచి మొదలవుతున్నాయి.

అత్యవసర ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు, వ్యాపార అవసరాల వంటి వాటి కోసం వేగంగా డబ్బులు అవసరమైనప్పుడు ముందుగా గుర్తు బంగారమే. చాలా తక్కువ సమయంలో చేతిలో డబ్బులు ఉండాలంటే బంగారమే సరైన మార్గం. కష్ట కాలంలో ఆర్థిక భరోసానిస్తుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు బంగారం తనఖాతో రుణాన్ని ఇస్తుంటాయి. ప్రస్తుత 2026 ఫిబ్రవరిలోని బంగారం ధరల ఆధారంగా చూసుకుంటే మీ దగ్గర ఉన్న 10 గ్రాముల బంగారంతో ఎంత లోన్ తీసుకోవచ్చు ? వడ్డీ రేట్లు, నెలవారీ ఈఎంఐ ఎంత వరకు ఉండవచ్చు? అనే వివరాలు తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం బ్యాంకులు బంగారం విలువ ఆధారంగా లోన్ ఇస్తుంటాయి. అయితే పూర్తి విలువకు తగినట్లు లోన్‌ ఇవ్వవు. బంగారం మార్కెట్ విలువలో కొంత శాతం తక్కువగా రుణం ఇస్తాయి. దీనినే లోన్ టు వాల్యూ రేషియో అంటారు. ఉదాహరణకు రూ. 2.5 లక్షల లోపు చిన్న రుణాలకు 85 శాతం వరకు ఎల్‌టీవీ రేషియో ఉంటుంది. ఇక రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ అయితే 80 శాతం ఎల్‌టీవీ ఉంటుంది. అంతకు మించి లోన్ తీసుకోవాలంటే 75 శాతం వరకు ఇస్తారు.

10 గ్రాముల బంగారంపై ఎంతొస్తుంది?

ఒకవేళ మీరు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై లోన్ తీసుకోవాలనుకుంటే అందులోని రాళ్లు, పూసలు, ఇతరాలను బరువు నుంచి తీసేస్తారు. ఆ తరువాత వచ్చే స్వచ్ఛమైన పసిడి బరువును లెక్కలోకి తీసుకుంటారు. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1.44 లక్షల స్థాయిలో ఉంది. దీనిపై గరిష్ఠ లోన్ విలువ 85 శాతం LTV ప్రకారం చూసుకుంటే రూ. 1,20,000 వరకు వస్తుంది. సాధారణ రుణం 75 శాతం నుంచి 80 శాతం ఎల్‌టీవీ రేషియోలో అయితే రూ.1,05,000 నుంచి రూ.1,12,000 వరకు లభిస్తుంది. మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల ప్రకారం సులభంగా రూ.1 లక్ష నుంచి రూ.1,20,000 మధ్య గోల్డ్ లోన్‌ పొందేందుకు అవకాశం ఉంటుంది.

పర్సనల్ లోన్స్‌తో పోలిస్తే బంగారం రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 8.50 శాతం నుంచి 12 శాతం వరకు ఉన్నాయి. ఇక మణప్పురం లేదా ముత్తూట్ గోల్డ్ లోన్ వంటి ప్రైవేట్ సంస్థల్లో 9.50 శాతం నుంచి 18 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి.

మీరు 10 గ్రాముల బంగారం కుదవ పెట్టి రూ. 1 లక్ష రుణాన్ని ఏడాది టెన్యూర్ పై తీసుకున్నారు అనుకుందాం. దానిపై 10 శాతం వడ్డీ రేటు నిర్ణయిస్తే నెలవారీ ఈఎంఐ రూ.8792 వరకు కట్టాల్సి వస్తుంది. గోల్డ్ లోన్ చెల్లించేందుకు మూడు రకాల ఆప్షన్లు ఉంటాయి. అసలు, వడ్డీ కలిపి నెల నెలా చెల్లించడం, నెల నెలా వడ్డీ మాత్రమే కట్టడం, గడువు ముగిశాక అసలు, మొత్తాన్ని క్లియర్ చేయడం వంటివి ఉంటాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banks
  • Bussiness
  • Gold Loan
  • Gold Loan Banks
  • Gold loan EMI
  • Gold Loan Interest
  • Gold Loan Rules
  • Gold Loans

Related News

Tech Mahindra Layoffs

టెక్‌ మహీంద్రాలో 30వేల లేఆఫ్‌లంటూ వార్తలు..

Tech Mahindra Layoffs  ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో భారీ స్థాయిలో లేఆఫ్స్ జరుగుతున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా 30 వేల మందిని తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై టెక్ మహీంద్రా కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల తొలగింపుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd