WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చు!
వాట్సాప్ చిన్న వ్యాపారుల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. అదే వాట్సాప్ బిజినెస్. ఈ యాప్ సహాయంతో మీరు మీ ఉత్పత్తులు లేదా సేవలను వృత్తిపరంగా ప్రచారం చేయవచ్చు.
- By Gopichand Published Date - 09:12 AM, Fri - 4 July 25

WhatsApp: ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ (WhatsApp) కేవలం చాటింగ్ లేదా వీడియో కాలింగ్ కోసం మాత్రమే కాదు. దీని ద్వారా మీరు ప్రతి నెలా వేల రూపాయలు సంపాదించవచ్చు. వాట్సాప్‌లో కేవలం సంభాషణలు మాత్రమే చేయగలమని మీరు ఆలోచిస్తే, ఇప్పుడు మీ దృక్పథాన్ని మార్చుకోవడానికి సమయం ఆసన్నమైంది. అనేక చిన్న వ్యాపారాలు, క్రియేటర్స్ వాట్సాప్‌ని ఉపయోగించి మంచి ఆదాయం పొందుతున్నారు. వాట్సాప్ ద్వారా మీరు ఎలా డబ్బు సంపాదించవచ్చో తెలుసుకుందాం.
వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా వ్యాపారం
వాట్సాప్ చిన్న వ్యాపారుల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. అదే వాట్సాప్ బిజినెస్. ఈ యాప్ సహాయంతో మీరు మీ ఉత్పత్తులు లేదా సేవలను వృత్తిపరంగా ప్రచారం చేయవచ్చు. ఇందులో మీరు ఉత్పత్తి కేటలాగ్, ఆటోమేటిక్ రిప్లై, లేబుల్స్, బిజినెస్ ప్రొఫైల్ వంటి ఫీచర్లను ఉపయోగించి కస్టమర్లతో నేరుగా అనుసంధానం కావచ్చు.
ఉదాహరణకు మీరు బట్టలు, ఆభరణాలు, ఇంట్లో తయారు చేసిన ఆహారం లేదా ఏదైనా స్థానిక ఉత్పత్తి వ్యాపారం చేస్తుంటే వాట్సాప్ ద్వారా మీ పాత, కొత్త కస్టమర్లతో అనుసంధానం కావచ్చు. ఆర్డర్లు తీసుకోవచ్చు. ఆన్‌లైన్ చెల్లింపులు కూడా స్వీకరించవచ్చు.
Also Read: July 4 : చరిత్రలో ఈరోజు ఎన్నో ప్రత్యేకతలు ..అవి ఏంటో చూడండి !!
అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం
ప్రస్తుతం అనేక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లు లాంటివి Amazon, Flipkart, Meesho వంటివి అఫిలియేట్ ప్రోగ్రామ్‌లను నడుపుతున్నాయి. ఇందులో మీరు వారి ఉత్పత్తుల లింక్‌లను షేర్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఆ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు కమీషన్ లభిస్తుంది. మీరు ఈ అఫిలియేట్ లింక్‌లను వాట్సాప్ గ్రూప్‌లలో లేదా మీ కాంటాక్ట్‌లకు పంపవచ్చు. మీ వద్ద యాక్టివ్ యూజర్ల నెట్‌వర్క్ ఉంటే ఈ పద్ధతి మీకు ప్రతి నెలా 5,000 నుండి 25,000 రూపాయల వరకు ఆదాయాన్ని అందించగలదు. అది కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా.
వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ప్రమోషన్ లేదా సబ్‌స్క్రిప్షన్
మీ వద్ద కెరీర్ గైడెన్స్, షేర్ మార్కెట్ చిట్కాలు, ఫిట్‌నెస్ లేదా విద్య వంటి ప్రత్యేక సమాచారం లేదా నైపుణ్యం ఉంటే మీరు వాట్సాప్ గ్రూప్‌ని సృష్టించి, దానిలో పెయిడ్ మెంబర్‌షిప్ అందించవచ్చు. చాలా మంది నిపుణులు ఇలా చేస్తున్నారు. 99 నుండి 499 రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తూ నెలకు వేల రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు కావాలనుకుంటే మీ పెయిడ్ కోర్సు లేదా ఈ-బుక్‌ను కూడా వాట్సాప్ ద్వారా విక్రయించవచ్చు. ఒకసారి మంచి ఆడియన్స్ ఏర్పడిన తర్వాత ఆదాయం నిరంతరం కొనసాగుతుంది.
చిన్న డిజిటల్ సేవలను విక్రయించడం
మీరు డిజిటల్ పోస్టర్లు, బర్త్‌డే కార్డులు, సోషల్ మీడియా డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ లేదా మెనూ కార్డు డిజైనింగ్ చేయడం వచ్చినట్లయితే వాట్సాప్ ద్వారా మీ సేవలను ప్రచారం చేయవచ్చు. మీరు నేరుగా కస్టమర్‌తో మాట్లాడి ఒప్పందాన్ని ఖరారు చేసి, ఆన్‌లైన్ చెల్లింపులు తీసుకొని పని చేయవచ్చు.