HDFC Bank : లోన్ వడ్డీ రేట్లు తగ్గించి ఖాతాదారుల్లో ఆనందం నింపిన HDFC బ్యాంక్
HDFC Bank : ఎంసీఎల్ఆర్ అనేది ఒక కనీస వడ్డీ రేటు, దీని కంటే తక్కువకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేవు. ఇది ఆర్బీఐ తీసుకొచ్చిన విధానం
- By Sudheer Published Date - 03:00 PM, Fri - 8 August 25

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును యథాతథంగా ఉంచినప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) తగ్గించింది. ఈ నిర్ణయం ఆగస్టు 7 నుంచి అమలులోకి వచ్చింది. దీనివల్ల ఎంసీఎల్ఆర్‌కు అనుసంధానమైన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎంసీఎల్ఆర్ అనేది ఒక కనీస వడ్డీ రేటు, దీని కంటే తక్కువకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేవు. ఇది ఆర్బీఐ తీసుకొచ్చిన విధానం.
Rakhi : 30 ఏళ్లుగా ప్రధాని మోడీకి రాఖీ కడుతున్న పాకిస్థాన్ ముస్లిం మహిళ !!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన టెన్యూర్లకు ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో ఇప్పుడు బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేట్లు 8.55 శాతం నుంచి 8.75 శాతం వరకు ఉన్నాయి, అంతకు ముందు ఇవి 8.60 శాతం నుంచి 8.80 శాతంగా ఉండేవి. ఓవర్‌నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గింది. 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి, 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం నుంచి 8.70 శాతానికి పడిపోయింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 9.05 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గింది, అయితే 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం వద్ద స్థిరంగా ఉంది. 3 సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 8.80 శాతం నుంచి 8.75 శాతానికి చేరింది.
Kohli New Look : తెల్లగడ్డం తో కోహ్లీ న్యూ లుక్
హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ వడ్డీ రేట్లు మాత్రం రెపో రేటుకు అనుసంధానమై ఉంటాయి. వేతన జీవులు, వ్యాపారులకు ప్రత్యేక హోమ్ లోన్ వడ్డీ రేట్లు కనీసం 7.90 శాతం నుంచి గరిష్టంగా 13.20 శాతం వరకు ఉన్నాయి, ఇది కూడా ఆగస్టు 7 నుంచే అమలులోకి వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేస్ రేటు ప్రస్తుతం 9.35 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం రుణగ్రహీతలకు ఊరటనిచ్చే అవకాశం ఉంది.