GST Reform: గుడ్ న్యూస్.. ఈ వస్తువులపై భారీగా తగ్గిన ధరలు!
హెచ్‌యూఎల్ ధరలు తగ్గించిన ఉత్పత్తులలో లైఫ్‌బాయ్ సబ్బు, డవ్ షాంపూ, కాఫీ, హార్లిక్స్, క్లోజప్ టూత్‌పేస్ట్, కిసాన్ జామ్, నార్ సూప్, బూస్ట్ డ్రింక్ వంటివి ఉన్నాయి.
- By Gopichand Published Date - 09:28 PM, Sat - 13 September 25

GST Reform: జీఎస్టీలో వచ్చిన మార్పుల (GST Reform) ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ (FMCG) కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించడం ప్రారంభించాయి. హిందుస్థాన్ యూనిలివర్ (HUL) వంటి సంస్థలు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించినట్లు ప్రకటించాయి. హెచ్‌యూఎల్ ధరలు తగ్గించిన ఉత్పత్తులలో లైఫ్‌బాయ్ సబ్బు, డవ్ షాంపూ, కాఫీ, హార్లిక్స్, క్లోజప్ టూత్‌పేస్ట్, కిసాన్ జామ్, నార్ సూప్, బూస్ట్ డ్రింక్ వంటివి ఉన్నాయి. ఈ ధరల తగ్గింపును ప్రకటిస్తూ హెచ్‌యూఎల్ వార్తాపత్రికలలో ప్రత్యేక ప్రకటనలు ఇచ్చింది.
జీఎస్టీ మార్పులు, ధరల తగ్గింపు
సెప్టెంబర్ 3న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీలో మార్పులు ప్రకటించారు. జీఎస్టీ స్లాబ్‌లను నాలుగు నుంచి కేవలం రెండు (5%- 18%)కి కుదించారు. 12%, 28% స్లాబ్‌లను తొలగించడంతో అనేక గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గింది. ఈ కారణంగానే కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి. సెప్టెంబర్ 22 నుండి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తాయి. ఈ తేదీ నుండి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ వస్తువుల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించాయి.
Also Read: Pawan Kalyan : గొడవలకు దిగవద్దు అంటూ జనసైనికులకు పవన్ సూచన
ఏ ఉత్పత్తుల ధరలు ఎంత తగ్గాయి?
- లైఫ్‌బాయ్ సబ్బు (75గ్రా): రూ. 68 నుంచి రూ. 60కి తగ్గింది.
- కిసాన్ జామ్ (200గ్రా): రూ. 90 నుంచి రూ. 80కి తగ్గింది.
- హార్లిక్స్ (200గ్రా జార్): రూ. 130 నుంచి రూ. 110కి తగ్గింది.
- లైఫ్‌బాయ్ సబ్బు (75గ్రా x 4): రూ. 68 నుంచి రూ. 60కి తగ్గింది.
- లక్స్ సబ్బు (75గ్రా x 4): రూ. 96 నుంచి రూ. 85కి తగ్గింది.
- క్లోజప్ టూత్‌పేస్ట్ (150గ్రా): రూ. 145 నుంచి రూ. 129కి తగ్గింది.
- క్లినిక్ ప్లస్ షాంపూ (355మి.లీ): రూ. 393 నుంచి రూ. 340కి తగ్గింది.
- సన్ సిల్క్ బ్లాక్ షైన్ షాంపూ (350మి.లీ): రూ. 430 నుంచి రూ. 370కి తగ్గింది.
- డవ్ సీరమ్ (75గ్రా): రూ. 40 (ధరలో మార్పు లేదు).
- హార్లిక్స్ ఉమెన్ (400గ్రా): రూ. 320 నుంచి రూ. 284కి తగ్గింది.
- కాఫీ (75గ్రా): రూ. 300 నుంచి రూ. 270కి తగ్గింది.
- నార్ టమాటో సూప్ (67గ్రా): రూ. 65 నుంచి రూ. 55కి తగ్గింది.
- హెల్‌మ్యాన్స్ రియల్ మయోనైజ్ (250గ్రా): రూ. 99 నుంచి రూ. 90కి తగ్గింది.
ఈ ధరల తగ్గింపుతో వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది.