BSNL-JIO ఒప్పందం వల్ల కేంద్రానికి రూ.1757కోట్ల నష్టం
BSNL-JIO : JIO BSNL మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. అయితే దీని కోసం చెల్లించాల్సిన బిల్లులను జియో పూర్తి స్థాయిలో చెల్లించలేదు
- By Sudheer Published Date - 12:55 PM, Thu - 3 April 25

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL, ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ JIO మధ్య 2014లో మౌలిక సదుపాయాల షేరింగ్‌కు ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం .. JIO BSNL మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. అయితే దీని కోసం చెల్లించాల్సిన బిల్లులను జియో పూర్తి స్థాయిలో చెల్లించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీగా నష్టం ఏర్పడింది. భారత అంచనా కమిషన్ (CAG) తాజా నివేదిక ప్రకారం ఈ ఒప్పందం వల్ల కేంద్రానికి రూ. 1757.56 కోట్లు నష్టం వచ్చింది.
Donald Trump Tariffs : అమెరికన్లపై పెను భారం
గత 10 ఏళ్లుగా JIO BSNL మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటున్నా, దానికి తగినట్లుగా ఛార్జీలు వసూలు చేయలేదని పేర్కొంది. దీంతో BSNL ఆదాయంలో పెరుగుదల లేకపోవడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. అంతేకాదు టెలికాం మౌలిక సదుపాయాల షేరింగ్‌లో లైసెన్స్ ఫీజు విధించకపోవడం వల్ల BSNLకూ అదనంగా రూ. 38.36 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు CAG తన నివేదికలో వెల్లడించింది.
Paritala Sunitha: నా భర్త హత్యలో జగన్ పాత్ర ఉంది.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు.
ఈ పరిణామం ప్రభుత్వం టెలికాం రంగంలో సరైన విధానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని నిపుణులు అంటున్నారు. BSNL వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవస్థ ఉండటంతో, ఇది నేరుగా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. JIO నుంచి బకాయి చెల్లింపులు సాధించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిన అంశం.