Women Entrepreneurs : ఫస్ట్ టైం ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు నిర్మల శుభవార్త
‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ స్కీంను(Women Entrepreneurs) కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు.
- By Pasha Published Date - 02:30 PM, Sat - 1 February 25

Women Entrepreneurs : ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి తొలిసారి వ్యాపారవేత్తలుగా ఎదిగిన మహిళల కోసం కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక రుణ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా దేశంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ ఫస్ట్ టైం మహిళా వ్యాపారవేత్తలకు రాబోయే ఐదేళ్లలో రూ.2 కోట్ల దాకా టర్మ్ లోన్‌లను మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Also Read :Concussion Substitute: కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏమిటి? ఐసీసీ ఏం చెబుతుంది!
క్రెడిట్ గ్యారంటీ కవరేజీ రూ.20 కోట్లకు పెంపు
దేశంలోని చిన్న,మధ్యతరహా పరిశ్రమలు (SME), భారీ పరిశ్రమలు తీసుకునే రుణాలకు సంబంధించిన క్రెడిట్ గ్యారంటీ కవరేజీని ఈ బడ్జెట్‌లో రెట్టింపు చేశారు. రుణాల క్రెడిట్ గ్యారంటీ కవరేజీ పరిమితిని రూ.20 కోట్లకు పెంచారు. అంటే ఎస్ఎంఈలు, భారీ పరిశ్రమలు ఆర్థికంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటే ఇకపై రూ.20 కోట్ల దాకా రుణమాఫీని పొందొచ్చు. ఈ పరిశ్రమలు చెల్లించే గ్యారంటీ ఫీజును 1 శాతానికి పరిమితమయ్యేలా చూస్తామని నిర్మల హామీ ఇచ్చారు.
Also Read :Party Defections : పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే : కేరళ హైకోర్టు
10వేల మందికి ‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్’
‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ స్కీంను(Women Entrepreneurs) కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. దీని ద్వారా 10వేల మంది యువతకు ఐఐటీలు, ఐఐఎస్‌సీలలో సాంకేతిక పరిశోధనల కోసం అవకాశాన్ని కల్పించనున్నారు.
చైనాతో భారత్ ఢీ
బొమ్మల తయారీలో చైనా టాప్. ఈ విభాగంలో దాన్ని ఢీకొనేందుకు భారత్ రెడీ అవుతోందని బడ్జెట్‌లో ప్రకటించారు. ‘మేడిన్ ఇండియా’ బ్రాండ్‌ను పైకి తెచ్చే లక్ష్యంతో బొమ్మల తయారీ యూనిట్లను ప్రోత్సహించనున్నారు. వాటికి ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. బొమ్మల తయారీ యూనిట్ల సిబ్బందికి శిక్షణ ఇస్తారు.బొమ్మల తయారీ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది.
టాప్-50 టూరిజం ప్రదేశాల వికాసం
దేశంలోని టాప్-50 టూరిజం ప్రదేశాలను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వాటిని కేంద్ర సర్కారు డెవలప్ చేస్తుంది. ఆయా ప్రదేశాల్లో మౌలిక వసతులు, టూరిస్టులు ఉండేందుకు అనువైన వసతులను కల్పిస్తారు. తద్వారా ఆయాచోట్ల యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తారు.