Gold is Gold : గోల్డ్ ఈజ్ గోల్డ్.. ఏటా 8 శాతం రిటర్నులు.. పెట్టుబడిగా బెస్ట్
ఈ లెక్కన ఇప్పుడు ఎవరైనా బంగారం కొన్నా.. రాబోయే నాలుగేళ్లలో మంచి లాభాలే(Gold is Gold) వస్తాయి.
- By Pasha Published Date - 10:24 AM, Tue - 4 February 25

Gold is Gold : ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అవునో కాదో కచ్చితంగా చెప్పలేం.. కానీ ‘గోల్డ్ ఈజ్ గోల్డ్’ అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే బంగారంలో పెట్టుబడి పెట్టిన వాళ్లు నష్టపోయిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. బంగారం ధర తగ్గిన దాఖలాలు కూడా లేనే లేవు. గత 50 ఏళ్ల హిస్టరీని పరిశీలిస్తే.. బంగారం ధర ప్రతి సంవత్సరం సగటున 8 శాతం మేర పెరిగింది. స్టాక్ మార్కెట్‌లో ప్రముఖ కంపెనీల షేర్లు కొని, లాంగ్ టర్మ్(కొన్నేళ్లు) వెయిట్ చేసిన వాళ్లకు ఎంతైతే లాభాలు వచ్చాయో.. అంతే లాభాలను బంగారం కూడా అందించింది. రాబోయే కొన్నేళ్లలో బంగారం ధర మరింత పెరుగుతుందని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్లకు చెందిన బంగారం 10 గ్రాముల ధర దాదాపు రూ.85వేలకుపైనే ఉంది. అది ఇంకో నాలుగేళ్లలో రూ.లక్షకు చేరుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన ఇప్పుడు ఎవరైనా బంగారం కొన్నా.. రాబోయే నాలుగేళ్లలో మంచి లాభాలే(Gold is Gold) వస్తాయి.
Also Read :YS Jagan : జగన్‌పై అనర్హత వేటు వేస్తారా ? పులివెందులకు బైపోల్ తప్పదా ?
బంగారం ఎందుకు సేఫ్ ?
- బంగారం అనేది ఒక వ్యూహాత్మక ఆస్తి. మన ఆర్థిక అత్యవసరాల కోసం దీన్ని వాడుకోవచ్చు.
- బంగారాన్ని తనాఖా పెట్టి లోన్స్ తీసుకోవచ్చు.
- ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం 2 శాతం నుంచి 5 శాతం దాకా ఉంటుంది. అంటే అన్ని రకాల ఖర్చులు, వివిధ ఉత్పత్తుల ధరలు దాదాపు 2 శాతం నుంచి 5 శాతం దాకా పెరిగిపోతున్నాయి. బంగారం రేటు అంతకంటే ఎక్కువే (8 శాతం) పెరుగుతోంది.
- కనీసం ఐదేళ్ల నుంచి పదేళ్ల పాటు వెయిట్ చేస్తాం అని భావించే వాళ్లకు బంగారం మంచి పెట్టుబడి సాధనం.
- ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభాలు కుదిపేసినా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గలేదు.
- స్టాక్ మార్కెట్లు డౌన్ అయినా బంగారం రేట్లు పడిపోలేదు.
- అందుకే బంగారంలో పెట్టుబడి అనేది చాలా సేఫ్.
Also Read :Donald Trump : ట్రంప్ తగ్గేదే లే.. కోట్లు ఖర్చుపెట్టి తరిమేస్తున్నాడు.. భారత్‌కు బయలుదేరిన విమానం
బంగారానికి ఎందుకీ డిమాండ్ ?
- బంగారం లభ్యత తక్కువగా ఉంటుంది. అందుకే దానికి అంతగా రేటు ఉంటుంది.
- బంగారాన్ని గనుల నుంచి వెలికి తీస్తారు. ఇది చాలా పెద్ద టెక్నికల్ ప్రాసెస్.
- గత 20 ఏళ్లలో గోల్డ్ మైనింగ్ ఏటా సగటున 1.7 శాతం మాత్రమే పెరిగింది.
- మార్కెట్లోకి ఒక్కసారిగా గోల్డ్ నిల్వలు రావడం అనేది జరగదు. అందువల్ల బంగారం ధరలు ఒక్కసారిగా భారీ హెచ్చుతగ్గులకు లోను కావడం అనేది జరగదు.
- మన దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉన్నట్టే .. అన్ని ప్రపంచ దేశాలకు కేంద్ర బ్యాంకులు ఉంటాయి. అవి బంగారాన్ని డిపాజిట్ చేసుకొని కరెన్సీని మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటాయి. అంటే అవి కూడా బంగారానికి ప్రయారిటీ ఇస్తాయి. దీన్నిబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం పాత్రను మనం అర్థం చేసుకోవచ్చు.