Gold Price : రూ.18కే తులం బంగారం..నిజామా..?
Gold Price : తులం బంగారం దాదాపు రూ.90 వేలకు చేరినప్పటికీ ప్రజలు మాత్రం బంగారం పై మక్కువ మాత్రం తగ్గించుకోవడం లేదు
- By Sudheer Published Date - 09:01 PM, Fri - 17 January 25

మార్కెట్లో (Market) రోజు రోజుకు బంగారానికి (Gold Price) భారీగా డిమాండ్ పెరుగుతుందో తెలియంది కాదు. తులం బంగారం దాదాపు రూ.90 వేలకు చేరినప్పటికీ ప్రజలు మాత్రం బంగారం పై మక్కువ మాత్రం తగ్గించుకోవడం లేదు. ధరను ఏమాత్రం లెక్కచేయకుండా మార్కెట్ లో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అప్పుడప్పుడు బంగారం రూ.వందల్లో పెరుగుతూ అప్పుడప్పుడూ తగ్గుతూ మధ్యతరగతి ప్రజలను ఊరిస్తుంటుంది. అసలు వందేళ్ల క్రితం పది గ్రాములు బంగారం ధర ఎంతుందో తెలుసా..? అక్షరాలా రూ.18 .75 ఇది ఎప్పుడో తెలుసా.? 1925.
Sunil : సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
1925లో పది గ్రాముల బంగారం ధర కేవలం రూ.18.75 మాత్రమే ఉండేది. ఆ సమయంలో బంగారం సాధారణ ప్రజలకూ అందుబాటులో ఉండేది. కానీ కాలక్రమేణా పెరుగుతున్న డిమాండ్, మారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. 1950లో తొలిసారి బంగారం ధర రూ.100 దాటగా, అది రూ.102.56కి చేరుకుంది. 1980లో వెయ్యి రూపాయల మార్కును దాటి బంగారం ధర రూ.1330కు చేరింది.
1985లో అది రూ.2130కు పెరగగా, 1996లో రూ.5160గా నమోదైంది. 2007లో బంగారం ధర రూ.10,800గా ఉండగా, 2022 నాటికి అది రూ.52,000కు చేరుకుంది. ప్రస్తుతం 2025 కు తులం బంగారం రూ.80 వేలకు చేరింది. బంగారానికి పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్, ఆర్థిక అస్థిరత, ఇతర భౌతిక పరిస్థితుల కారణంగా బంగారం ధరలు ఇలా నిత్యం పెరుగుతూ వస్తుంది. బంగారం ధరల పెరుగుదల వల్ల అది సాధారణ ప్రజల అందుబాటులో నుంచి దూరమవుతోంది. ఇప్పటికీ బంగారం కొనుగోలు మధ్యతరగతి ప్రజల కోసం పెద్ద ఆర్థిక భారం అవుతోంది.