పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!
గత కొంతకాలంగా ప్రతిరోజూ వేల రూపాయల మేర పెరుగుతూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 18,270 మేర క్షీణించింది
- Author : Sudheer
Date : 31-01-2026 - 10:59 IST
Published By : Hashtagu Telugu Desk
బంగారం, వెండి ధరల విషయంలో “పెరుగుట విరుగుట కొరకే” అనే సామెమైంది. త అక్షరాలా నిజగత కొన్ని వారాలుగా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్న పసిడి ధరలు, ఇప్పుడు అంతే వేగంతో నేలచూపులు చూస్తున్నాయి.
బంగారం, వెండి ధరల భారీ పతనం
గత కొంతకాలంగా ప్రతిరోజూ వేల రూపాయల మేర పెరుగుతూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 18,270 మేర క్షీణించింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 16,750 తగ్గడం విశేషం. నిన్నటి వరకు లక్షల రూపాయల వద్ద ఊరించిన ధరలు ఇప్పుడు భారీగా దిగిరావడంతో, కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం కావడం, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడం వల్ల ఈ “గోల్డ్ క్రాష్” సంభవించింది.
వెండి రేటులో ఊహించని కుదుపు బంగారం కంటే వెండి ధరల్లో పతనం మరింత తీవ్రంగా ఉంది. కేవలం రెండంటే రెండు రోజుల్లోనే కేజీ వెండిపై రూ. 75,000 మేర తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ. 55,000 పతనమై రూ. 3,50,000 మార్కుకు చేరుకుంది. వెండి ధరల్లో 30 శాతం వరకు ఈ కరెక్షన్ రావడం వల్ల ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. అయితే, వెండి సామాన్లు లేదా వెండి వస్తువులు కొనాలనుకునే సామాన్యులకు మాత్రం ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మారింది.

Today Gold Silver Prices
శుభకార్యాల వేళ సామాన్యులకు ఊరట
త్వరలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు ముహూర్తాలు ఉండటంతో, బంగారం ధరల తగ్గుదల మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా నిలిచింది. ధరలు పెరుగుతున్న సమయంలో ఆందోళన చెందిన జనం, ఇప్పుడు జ్యువెలరీ షాపుల బాట పడుతున్నారు. ఈ భారీ పతనం తర్వాత ధరలు స్థిరంగా ఉంటాయా లేదా ఇంకా తగ్గుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా, “పెరుగుట విరుగుట కొరకే” అన్నట్లుగా.. అతిగా పెరిగిన ధరలు ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులోకి రావడం ఒక గొప్ప పరిణామం.