HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Uttarakhand To Implement Uniform Civil Code From Jan 27 Says Cm Dhami

Uniform Civil Code : జనవరి 27 నుంచి యూసీసీ అమల్లోకి.. కీలక రూల్స్ ఇవీ

సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీ యూసీసీ(Uniform Civil Code) ముసాయిదా బిల్లును తయారు చేసింది.

  • By Pasha Published Date - 04:36 PM, Sun - 26 January 25
  • daily-hunt
Uniform Civil Code Ucc Uttarakhand Cm Pushkar Singh Dhami 2025

Uniform Civil Code : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) సోమవారం (జనవరి 27) నుంచి ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో అమల్లోకి రానుంది. దీంతో దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఇవాళ (ఆదివారం)  ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలుపై అధికారులకు శిక్షణ పూర్తయిందన్నారు. ‘‘యూసీసీ అమలుతో సమాజంలో ఏకరూపత వస్తుంది. పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు అందుబాటులోకి వస్తాయి’’ అని సీఎం ధామి చెప్పారు.

Also Read :Rain Free In Cafe : ఈ కేఫ్‌లో వర్షం ఫ్రీ.. కాఫీని సిప్ చేయగానే జోరువాన

ఉత్తరాఖండ్ యూసీసీలోని ముఖ్యాంశాలు

  • వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అన్ని మతాల వారు ఒకే వ్యవస్థ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • సహ జీవన సంబంధాలను కలిగిన వారు కూడా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • సైనికులు, వాయుసేనలో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యం ఉంటుంది. వారు అత్యవసర పరిస్థితుల్లో  ఈవిధంగా వీలునామాను రాయించుకోవచ్చు.
  • అన్ని మతాల స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది.
  • అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని బ్యాన్ చేశారు. ఓ వర్గం వారిలో ఉన్న బహుభార్యత్వ పద్ధతికి ఉత్తరాఖండ్‌లో బ్రేక్ పడనుంది.
  • ఓ వర్గానికి చెందిన  హలాలా విధానంపై బ్యాన్ విధించారు.

Also Read :Deputy CM Bhatti : తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్రం అవమానించింది.. ‘పద్మ అవార్డుల’పై డిప్యూటీ సీఎం భట్టి స్పందన

బిల్లు గురించి..

  • సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీ యూసీసీ(Uniform Civil Code) ముసాయిదా బిల్లును తయారు చేసింది.
  • 2022 మే 27న ఏర్పాటైన  ఈ కమిటీ దాదాపు ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి నాలుగు సంచికల్లో యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది.
  • ఈ బిల్లును 2024 ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Dhami
  • Pushkar Singh Dhami
  • UCC
  • uniform civil code
  • uttarakhand
  • Uttarakhand - UCC
  • Uttarakhand CM

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd