Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు.. ఏ నగరంలో ఎంతంటే?
ఢిల్లీలో నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ లీటరుకు రూ. 94.77, డీజిల్ లీటరుకు రూ. 87.67 వద్ద స్థిరంగా ఉంది. అలాగే నోయిడాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.85 కాగా, నిన్న రూ.94.87 కంటే కొంచెం తక్కువగా ఉంది.
- By Gopichand Published Date - 12:36 PM, Sun - 10 November 24

Petrol Diesel Prices: నేడు దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) స్వల్పంగా స్థిరంగా, కొన్ని చోట్ల స్వల్ప హెచ్చుతగ్గులతో నమోదయ్యాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 94.77 వద్ద, డీజిల్ లీటరుకు రూ. 87.67 వద్ద కొనసాగుతోంది. నోయిడా, గుర్గావ్, మీరట్‌లలో స్వల్ప క్షీణత కనిపించగా.. పాట్నా, లక్నోలో స్వల్ప పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ముంబై, జైపూర్‌లలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఘజియాబాద్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఢిల్లీలో నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ లీటరుకు రూ. 94.77, డీజిల్ లీటరుకు రూ. 87.67 వద్ద స్థిరంగా ఉంది. అలాగే నోయిడాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.85 కాగా, నిన్న రూ.94.87 కంటే కొంచెం తక్కువగా ఉంది. డీజిల్ ధర కూడా లీటరుకు రూ.87.98గా ఉంది. ఇది నిన్నటి రూ. 88.01 నుండి కాస్త తక్కువగా లభ్యమవుతుంది.
Also Read: Champions Trophy: టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? బీసీసీఐ తుది నిర్ణయం ఇదే!
ఘజియాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ. 94.71 కాగా.. డీజిల్ లీటరుకు రూ. 87.82 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాట్నాలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ. 105.53 కాగా నిన్న రూ. 105.34 నుండి పెరిగింది. డీజిల్ ధర లీటరుకు రూ. 92.37, నిన్నటి రూ. 92.19 కంటే కొంచెం ఎక్కువగా ఉంది. లక్నోలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 94.84కి పెరిగింది. ఇది నిన్నటి రూ. 94.69 నుండి పెరిగింది. డీజిల్ ధర కూడా లీటరుకు రూ. 87.98గా ఉంది. ఇది నిన్న రూ. 87.81 నుండి పెరిగింది. ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ. 103.44, డీజిల్ లీటరుకు రూ. 89.97 వద్ద స్థిరంగా ఉంది. జైపూర్ పెట్రోల్‌పై లీటరుకు రూ. 104.72, డీజిల్‌పై లీటరుకు రూ. 90.21 వద్ద ఎటువంటి మార్పు లేదు.
గుర్గావ్‌లో ఈరోజు పెట్రోల్ లీటరుకు రూ. 95.09, నిన్నటి రూ. 95.17 కంటే కొంచెం తక్కువగా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ. 87.95 కాగా నిన్న రూ. 88.02 నుంచి తగ్గింది. మీరట్‌లో పెట్రోల్ లీటరుకు రూ. 94.56, నిన్నటి రూ. 94.58 నుండి తగ్గింది. డీజిల్ కూడా లీటరుకు రూ. 87.64 వద్ద ఉంది. నిన్నటి రూ. 87.67 కంటే కొంచెం తక్కువగా లభ్యమవుతుంది. ఇకపోతే తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46గా ఉంది. ఇకపోతే లీటర్ డీజిల్ ధర రూ. 95.70గా ఉంది.