HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Brihaspati Technologies Limited Has Achieved A New Success

Brihaspati Technologies Limited : సరికొత్త విజయాన్ని సాధించిన బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ అనే సంస్థ

Brihaspati Technologies Limited : ఇప్పటివరకు సంస్థ దేశవ్యాప్తంగా 12 లక్షల సీసీటీవీ కెమెరాలు అమర్చి విశేష అనుభవాన్ని సంపాదించింది. బీఎస్ఎఫ్, భారత ఎన్నికల కమిషన్, వన్యప్రాణుల నిఘా, పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ వంటి అనేక రంగాల్లో సంస్థ కీలక భూమిక పోషిస్తోంది

  • Author : Sudheer Date : 26-06-2025 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brihaspati Technologies Lim
Brihaspati Technologies Lim

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ అనే సంస్థ తాజాగా గొప్ప విజయాన్ని సాధించింది. విదేశీ సంస్థాగత మదుపుదారుల నుంచి 10 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించింది. ఈ పెట్టుబడితో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ పాపోలు ప్రకారం.. హైదరాబాద్‌లో 72 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సీసీటీవీ ఉత్పాదక యూనిట్‌ను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రారంభించాలనే యోచనతో ఉన్నారు.

Tulbul project : పాక్‌కు అడ్డుకట్ట..తుల్‌బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం యోచన..!

విస్తరణకు భాగంగా కంపెనీ 400 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని, అంతర్జాతీయ స్థాయిలో తయారయ్యే, కానీ భారత్‌లో అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత భద్రతా పరిష్కారాలను అందించాలని భావిస్తోంది. కంపెనీ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే యోచనలో ఉంది. IPO ద్వారా వచ్చే నిధులతో తమ పరిశోధన మరియు అభివృద్ధి (R&D) విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచాలని, అలాగే కొత్త ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయాలని ఆశిస్తోంది.

ఇక ఇటీవల బృహస్పతి టెక్నాలజీస్ సంస్థకు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) నుండి ఒక ముఖ్యమైన నిఘా ప్రాజెక్ట్ లభించింది. ఇందులో భాగంగా MSRTC నెట్‌వర్క్‌ వ్యాప్తంగా ఏఐ ఆధారిత సీసీటీవీ వ్యవస్థలను అమర్చనున్నది. ఇప్పటివరకు సంస్థ దేశవ్యాప్తంగా 12 లక్షల సీసీటీవీ కెమెరాలు అమర్చి విశేష అనుభవాన్ని సంపాదించింది. బీఎస్ఎఫ్, భారత ఎన్నికల కమిషన్, వన్యప్రాణుల నిఘా, పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ వంటి అనేక రంగాల్లో సంస్థ కీలక భూమిక పోషిస్తోంది. ఒకే రోజు 19 రాష్ట్రాల్లో 64,000 సీసీటీవీ కెమెరాలను అమర్చి NEET పరీక్ష కోసం రికార్డు సృష్టించడం ఈ సంస్థ ప్రతిభకు నిదర్శనం. దేశంలో నిఘా, భద్రతా రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ అవసరాలను అందుకునేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని రాజశేఖర్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brihaspati Technologies Limited
  • hyderabad

Related News

Srh Klassen

IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

క్లాసెన్ ప్రదర్శనపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు. "క్లాసెన్ ఫ్యాన్స్ కు దేవుడయ్యాడు" అంటూ పోస్ట్‌లు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆటగాడు

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

Latest News

  • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

  • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

  • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

  • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

  • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd