HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Bitcoin Surges To Record High Of Over 105000 Dollars For First Time

Bitcoin Record High : మరోసారి బిట్‌కాయిన్ రికార్డు ధర.. రూ.89 లక్షలకు చేరిక

తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే క్రిప్టో కరెన్సీ(Bitcoin Record High) మార్కెట్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తానని ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

  • By Pasha Published Date - 07:34 AM, Mon - 16 December 24
  • daily-hunt
Bitcoin Record High 2024

Bitcoin Record High : బిట్‌కాయిన్ ధర మరోసారి రికార్డు స్థాయికి పెరిగింది. ఇవాళ క్రిప్టో కరెన్సీ మార్కెట్లు ప్రారంభం కాగానే దాని ధర ఏకంగా రూ.89 లక్షలు (1.05 లక్షల డాలర్లకు) చేరింది. ఈనెలా చివరికల్లా బిట్ కాయిన్ ధర రూ.93 లక్షలకు (1.10 లక్షల డాలర్లు) చేరుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే క్రిప్టో కరెన్సీ(Bitcoin Record High) మార్కెట్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తానని ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌ క్రిప్టో మార్కెట్‌ను గత కొన్ని వారాలుగా దౌడు తీయిస్తున్నాయి.

Also Read :Winter Tour : డిసెంబర్‌లో హిమపాతాన్ని ఆస్వాదించడానికి ఈ 3 హిల్ స్టేషన్‌లకు ట్రిప్ ప్లాన్ చేయండి..!

జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్‌గా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం భారీ అప్పుల్లో ఉంది. వాటిపై ఏటా పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించే చర్యల్లో భాగంగా బిట్‌కాయిన్‌ను అమెరికా ప్రభుత్వ వ్యూహాత్మక రిజర్వు నిధిగా ట్రంప్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ట్రంప్‌ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించనున్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఇదే కోణంలో ట్రంప్‌కు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ప్రచారంలోనూ క్రిప్టో కరెన్సీ గురించి ఇదే అంశాన్ని ఎలాన్ మస్క్ బాహాటంగా చెప్పేశారు. క్రిప్టో మార్కెట్‌లో ఎలాన్ మస్క్‌కు భారీ పెట్టుబడులు ఉన్నాయి.

Also Read :Sweat : ఎక్కువ చెమట పట్టడం వల్ల కేలరీలు వేగంగా కరిగిపోతాయా..?

పెట్టుబడి రూ.2,200 కోట్లు.. ప్రస్తుత వ్యాల్యూ రూ.5వేల కోట్లు : ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు 

సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ దేశం బిట్‌కాయిన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. తమ దేశం ఇప్పటివరకు బిట్‌కాయిన్‌లో పెట్టిన పెట్టుబడుల విలువ దాదాపు రూ.5వేల కోట్లు దాటిందని ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకీల్ ప్రకటించారు. బిట్ కాయిన్ ధర పెరగడంతో తమ పెట్టుబడుల విలువకు రెక్కలు వచ్చాయని ఆయన చెప్పారు. వాస్తవానికి తాము బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేసింది కేవలం రూ.2,200 కోట్లు మాత్రమేనని ఆయన తెలిపారు. ఇదేవిధంగా చాలా దేశాలు బిట్ కాయిన్‌లో పెట్టుబడుల దిశగా ఆసక్తి చూపుతున్నాయి. త్వరలో అమెరికా కూడా ఈ జాబితాలో చేరబోతోంది. ఈ పరిణామం ఎటువైపుగా వెళ్తుందో వేచిచూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 105000 dollars
  • Bitcoin
  • Bitcoin Record High
  • Donald Trump

Related News

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 212(ఎఫ్) వలసదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి రాష్ట్రపతికి పరిమిత రాజ్యాంగ అధికారాన్ని ఇస్తుంది.

    Latest News

    • Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో స‌రికొత్త మైలురాయి.. భార‌త్ నుంచి నాల్గ‌వ బ్యాట‌ర్‌గా హిట్ మ్యాన్‌!

    • Kohli Dance: విశాఖ‌ప‌ట్నం వ‌న్డేలో డ్యాన్స్ అద‌ర‌గొట్టిన కోహ్లీ.. వీడియో వైర‌ల్‌!

    • Diseases: యువతలో పెరుగుతున్న వ్యాధులపై షాకింగ్ రీజ‌న్‌..!

    • Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్‌ బుమ్రా జీవితంలో విషాదం గురించి తెలుసా?

    • Girls Fight: ఘోరంగా కొట్టుకున్న ఇద్ద‌రు అమ్మాయిలు.. వీడియో వైర‌ల్‌!

    Trending News

      • IndiGo Flight Disruptions : ఇండిగో విమానం రద్దుతో కూతురి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు

      • Zero Balance Accounts: బ్యాంక్ అకౌంట్ ఉన్న‌వారికి శుభ‌వార్త చెప్పిన ఆర్బీఐ!

      • Justin Greaves: టెస్టుల్లో గ్రీవ్స్ స‌రికొత్త ప్రపంచ రికార్డు.. నంబర్ 6లో బ్యాటింగ్ చేస్తూ డబుల్ సెంచ‌రీ!!

      • Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!

      • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd