HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Bank Mergers Are Back On The Scene Will These Banks Be Seen Again

SBI Chairman : మళ్లీ తెరపైకి బ్యాంకుల విలీనం.. ఇక ఈ బ్యాంకులు కనిపించవా?

  • By Vamsi Chowdary Korata Published Date - 02:13 PM, Sat - 15 November 25
  • daily-hunt
Challa Sreenivasulu Setty
Challa Sreenivasulu Setty

మన దేశంలో కొంత కాలంగా బ్యాంకుల విలీనం వేగం పుంజుకుందని చెప్పొచ్చు. 2020లో మెగా బ్యాంకుల విలీనం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు 10 బ్యాంకులు.. 4 పెద్ద బ్యాంకుల్లో కలిశాయి. తర్వాత రీజనల్ రూరల్ బ్యాంకులు కూడా విలీనం అవుతున్నాయి. ఇప్పుడు ఈ బ్యాంకుల విలీనానికి ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మద్దతు పలికారు.

ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కొద్ది రోజులుగా విస్తృతంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.మరోసారి మెగా బ్యాంకుల విలీనం ఉంటుందని చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనిపై మాట్లాడారు. బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ మంచిదేనని అన్నారు.అంతర్జాతీయ బ్యాంకులుగా ఎదగాలంటే పెద్ద బ్యాంకులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న బ్యాంకులతోనే ఇది సాధ్యం కాదని చెప్పారు. దీంతో మరోసారి విలీనం జరగక తప్పదని.. అప్పుడే పెద్ద బ్యాంకులుగా ఏర్పడే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు.దీంతో మరోసారి విలీనం ప్రక్రియ గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. 2020 లో అప్పుడు చిన్న ప్రభుత్వ బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు మలివిడత విలీన ప్రక్రియకు కేంద్రం సిద్ధమైనట్లే తెలుస్తోంది. ఇప్పుడు 12 ప్రభుత్వ బ్యాంకుల్ని.. 8 కి పరిమితం చేసే యోచనలో ఉందని సమాచారం.

తాజాగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనంపై అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. మరోసారి విలీనం జరిగితే మంచిదేనని అభిప్రాయపడ్డారు. అప్పటికి కూడా చిన్న బ్యాంకులు మనుగడలోనే ఉంటాయని ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎస్బీఐ ఇప్పటికే దిగ్గజ బ్యాంకుగా ఉన్నప్పటికీ.. మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకునే విషయంలో రాజీ పడట్లేదని శెట్టి స్పష్టం చేశారు.

ప్రస్తుతం బ్యాంక్ మొత్తం ఆస్తుల విలువ రూ. 69 లక్షల కోట్లుగా ఉండగా.. తర్వాతి స్థానంలో HDFC బ్యాంక్ రూ. 40 లక్షల కోట్లతో ఉంది. అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో.. భారతీయ ఎగుమతులపై ప్రభావం కనిపించినప్పటికీ.. ఎస్బీఐ మాత్రం తన రుణాల విషయంలో ఎలాంటి కోతలు విధించట్లేదని స్పష్టం చేశారు శెట్టి.

బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం సహా అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా చేయడం కోసం కేంద్రం.. 2017 నుంచి విలీనాల్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య గతంలో 27 గా ఉండగా.. 12కు తగ్గాయి. 2020లోనే చూస్తే.. 10 చిన్న ప్రభుత్వ బ్యాంకులు 4 పెద్ద బ్యాంకులుగా మారాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలిశాయి. సిండికేట్ బ్యాంకు.. కెనరా బ్యాంకులో విలీనమైంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. అలహాబాద్ బ్యాంకు.. ఇండియన్ బ్యాంకులో విలీనమైంది. దానికి ముందు 2017-19లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిశాయి.

ఇప్పుడు విలీన పరిశీలనలో ఉన్న బ్యాంకుల విషయానికి వస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేసేందుకు ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఇదే జరిగితే అప్పుడు ఎస్బీఐ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో అతిపెద్ద బ్యాంకుగా మారుతుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి చిన్న బ్యాంకుల్ని ఎస్బీఐ లేదా పంజాబ్ నేషనల్ బ్యాంకు లేదా బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయొచ్చని తెలుస్తోంది. అప్పుడు కేవలం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు వంటి పెద్ద బ్యాంకులే ఉండనున్నట్లు సమాచారం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Challa Sreenivasulu Setty
  • merge
  • public sector banks
  • sbi
  • SBI Chairman

Related News

Rules Change

Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతా నిబంధనలను మార్చింది. డిసెంబర్ 1 నుండి ప్రతి SMS అలర్ట్ కోసం రూ. 0.15 పైసల ఫీజు వసూలు చేయబడుతుంది.

    Latest News

    • HILT Policy : హిల్ట్ పాలసీపై విమర్శలు.. కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఆగ్రహం

    • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

    • India-Russia : భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

    • Akhanda 2 Postponed : అఖండ-2 వాయిదా..నిర్మాతల పై బాలయ్య తీవ్ర ఆగ్రహం?

    • 14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!

    Trending News

      • Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!

      • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

      • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

      • Putin Religion: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పాటించే మతం ఏమిటి? ఆయనకు దేవుడిపై విశ్వాసం ఉందా?

      • Putin Personal Toilet: పుతిన్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత టాయిలెట్.. ఎందుకంత పకడ్బందీ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd