HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Bank Holidays In Nov 2024

Bank Holidays in Nov 2024 : నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఎన్ని వచ్చాయంటే..

Bank Holidays in November 2024 : ఇక ఈ నెలలో పండుగలు, ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలతో కలుపుకొని మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి

  • By Sudheer Published Date - 10:16 AM, Fri - 1 November 24
  • daily-hunt
Bank Holidays
Bank Holidays

Bank Holidays in November 2024 : నెల మారుతుందంటే సామాన్య ప్రజల్లోనే కాదు బ్యాంకు ఖాతాదారుల్లో (Bank Customers) కొత్త టెన్షన్. సామాన్య ప్రజలు గ్యాస్ ధర (Gas Price) ఎంత పెరుగుతుందో అని..వంట సామాన్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో అని , పెట్రోల్ ధరలు (Petrol Price) తగ్గుతాయా..పెరుగుతాయా..అని ఎదురుచూస్తుంటారు. ఇక బ్యాంకు ఖాతాదారులు కొత్తగా ఏ రూల్స్ వస్తాయో..బ్యాంకు టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయో..అనేది చూస్తుంటారు.

ఇప్పుడు కూడా అలాగే ఎదురుచూస్తున్నారు. ఈరోజు నుండి (November 2024) నెల మొదలైంది. ఈ తరుణంలో నవంబర్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు పనిచేస్తున్నాయి..ఏ ఏ రోజు బ్యాంకులకు సెలవులు అనేది తెలుసుకునే పనిపడ్డారు. ఇక ఈ నెలలో పండుగలు, ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలతో కలుపుకొని మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ప్రాంతీయ పండుగలు, ఈవెంట్‌లు వాటి స్థానాన్ని బట్టి రాష్ట్రాల్లో సెలవులు మారుతూ ఉన్నాయి. ఈ సెలవుల్లో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాంకుకు వెళ్లాలనుకునేవారు వీటి ఆధారంగా ప్లాన్ చేసుకోవాలి.

నవంబర్‌లో బ్యాంకులకు (Bank Holidays in Nov 2024) సెలవులు చూస్తే..

నవంబర్1(శుక్రవారం): దీపావళి, కుత్ , కన్నడ రాజ్యోత్సవాల కారణంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం , మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 2 (శనివారం): దీపావళి, లక్ష్మీ పూజ ,గోవర్ధన్ పూజ సందర్బంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 3 (ఆదివారం): అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTs) బ్యాంకులు ఆదివారం మూసివేయబడతాయి

నవంబర్ 7 (గురువారం): ఛత్ (సాయంత్రం అర్ఘ్య) సందర్భంగా బెంగాల్, బీహార్ ,జార్ఖండ్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి .

నవంబర్ 8 (శుక్రవారం): ఛత్ (ఉదయం అర్ఘ్య)/వంగల పండుగ సందర్భంగా బీహార్, జార్ఖండ్ , మేఘాలయ వంటి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 9 (శనివారం): రెండవ శనివారం

నవంబర్ 10 (ఆదివారం): ఆదివారం

నవంబర్ 15 (శుక్రవారం): గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/రహస్ పూర్ణిమ సందర్భంగా మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్-తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ వంటి కొన్ని చోట్ల బ్యాంకులు మూసివేయబడతాయి. రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్.

నవంబర్ 17 (ఆదివారం): ఆదివారం

నవంబర్ 18 (సోమవారం): కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 23 (శనివారం): మేఘాలయలో, సెంగ్ కుత్స్నెమ్ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

అలాగే నవంబర్ 23 నాలుగో శనివారం.

నవంబర్ 24 (ఆదివారం): ఆదివారం

Read Also : Free Gas Cylinders Scheme : నేటి నుండి ఏపీ లో ఫ్రీ గ్యాస్..తట్టుకోలేకపోతున్నా వైసీపీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BANK HOLIDAYS
  • Bank Holidays in Nov 2024
  • Bank timings

Related News

    Latest News

    • Assam: అస్సాంలో సంచలన నిర్ణయం.. బహుభార్యత్వంపై నిషేధం బిల్లు ఆమోదం!

    • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చ‌నిపోయారా? సీఎంకే షాక్ ఇచ్చిన పాక్‌!

    • Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం.. 5.3 తీవ్రత నమోదు!

    • WPL Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం.. దీప్తి శర్మకు భారీ ధర, అలిస్సా హీలీ అన్‌సోల్డ్!

    • Tata Sierra: టాటా సియెర్రా.. కేవలం డిజైనే కాదు, సేఫ్టీలోనూ ‘సుప్రీమ్’!

    Trending News

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd