Aadhaar Card: ఆధార్ కార్డును ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలా..? అయితే చేసుకోండిలా..!
- By Gopichand Published Date - 09:00 AM, Fri - 14 June 24
![Aadhaar Card: ఆధార్ కార్డును ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలా..? అయితే చేసుకోండిలా..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/02/aadhar.jpg)
Aadhaar Card: భారతదేశంలోని ప్రతి పౌరుడు ఆధార్ కార్డు (Aadhaar Card)ను కలిగి ఉండటం అవసరం. ఇది ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. పాఠశాల, కళాశాల, బ్యాంకు సంబంధిత పనులకు ఆధార్ కార్డు తప్పనిసరి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆధార్ కార్డు 12 అంకెల విశిష్ట సంఖ్యను అప్డేట్ చేయడానికి ఉచిత సదుపాయం అందించారు అధికారులు.
ఉచిత ఆధార్ గడువు తేదీ పొడిగించారు
గతంలో UIDAI జూన్ 14, 2024 వరకు ఆధార్ కార్డ్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీని ఉచితంగా అప్డేట్ చేసే సదుపాయాన్ని అందించింది. అయితే ఇప్పుడు దాని తేదీని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. ఇటువంటి పరిస్థితిలో ఆధార్ వినియోగదారులు ఉచితంగా ఆధార్‌ను నవీకరించడానికి సెప్టెంబర్ 14 వరకు అవకాశం ఉంది.
ఉచితంగా ఆధార్‌ను ఎలా, ఎక్కడ అప్డేట్ చేయాలి?
ఆధార్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీని మార్చుకునే ఉచిత సదుపాయాన్ని UIDAI 14 సెప్టెంబర్ 2024 వరకు అందిస్తోంది. ఆన్లైన్ ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఆధార్ కార్డ్‌ను అప్డేట్ చేయవచ్చు. మీరు myAadhaar పోర్టల్ ద్వారా మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీలో మార్పులు చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 14 తర్వాత దీనికి రూ.50 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: PM Modi: ఇటలీ బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ..!
ఆధార్ నుండి ఫోటో కూడా ఉచితంగా మార్చుకోవచ్చా?
UIDAI ప్రకారం.. మీరు ఆధార్‌తో ఫోటోను ఉచితంగా మార్చలేరు. myAadhaar పోర్టల్‌లో దీని కోసం ఎలాంటి సదుపాయం కల్పించబడలేదు. మీరు ఆన్లైన్ ప్రక్రియను అనుసరించి ఆధార్ నుండి మీ పాత ఫోటోగ్రాఫ్‌ను మార్చడానికి ఫారమ్‌ను పూరించవచ్చు. తదుపరి ప్రాసెసింగ్ కోసం మీరు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.
ఆధార్ నుండి ఫోటో మార్చడానికి ఫారమ్‌ని డౌన్లోడ్ చేయడం ఎలా?
UIDAI- uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇక్కడ మీరు ముందుగా మీ ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. దీని కోసం ఆధార్‌తో లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి. తర్వాత మీరు హోమ్ పేజీలో ఆధార్ నమోదు ఫారమ్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేసి, ఫారమ్‌ను డౌన్లోడ్ చేయండి. ఫారమ్ నింపిన తర్వాత, మీరు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. ఇక్కడ మళ్లీ మీ బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయాలి. దీని తర్వాత మీ ఫోటో తీయబడుతుంది. ఈ ప్రక్రియ కోసం ఆధార్ కేంద్రానికి రూ.100 కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ ఆధార్ ఫోటో అప్డేట్ చేయబడుతుంది. మీరు కొత్త ఫోటోతో ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోగలరు.
We’re now on WhatsApp : Click to Join
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Free Aadhaar Update: ఆధార్ వినియోగదారులకు శుభవార్త.. ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/MixCollage-14-Jun-2024-03-49-PM-8602.jpg)
Free Aadhaar Update: ఆధార్ వినియోగదారులకు శుభవార్త.. ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?
ఇండియాలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు ఉండడం అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆ