Royal Enfield: మంటల్లో బుల్లెట్ బండి.. వీడియో వైరల్!
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో
- By Balu J Published Date - 03:37 PM, Mon - 4 April 22

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, దానికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. రవిచంద్ర అనే వ్యక్తి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసి, గుంతకల్లు మండలం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకోవడానికి ( మైసూరు నుంచి సుమారు 387 కి.మీ. దూరం) నాన్‌స్టాప్‌గా బైక్ పై ప్రయాణించాడు. ఆ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే బైక్‌లో మంటలు చెలరేగాయి. బైక్‌లో మొదట మంటలు చెలరేగి, ఆపై దాని పెట్రోల్ ట్యాంక్ పేలడంతో ఆ ప్రాంతం ప్రజలు షాక్‌కు గురయ్యారు. వాహనంపై నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు. బైక్ కు ఎందుకు మంటలు అంటుకున్నాయి అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
https://twitter.com/AlluHarish17/status/1510463748498022400?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1510463748498022400%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fviral-video-new-royal-enfield-bike-catches-fire-outside-temple-in-andhra-pradesh-2861281