Solar EV : సోలార్ పవర్‌తో నడిచే ఎలక్ట్రిక్ వాహనం ఇదిగో
వీటిలో రెండు వాహన(Solar EV) వేరియంట్ల రేట్లు రూ.5 లక్షలలోపు ఉంటాయట. తొలి 25వేల మంది కస్టమర్లకు ఈ రేట్లతో వాహనాలను విక్రయిస్తారు.
- Author : Pasha
Date : 18-01-2025 - 6:51 IST
Published By : Hashtagu Telugu Desk
Solar EV : భవిష్యత్తులో అరబ్ దేశాలకు చుక్కలు కనిపించేలా ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వాహనాలు, సోలార్ వాహనాల తయారీ ప్రక్రియ ఊపందుకుంది. వీటి తయారీకి సంబంధించిన టెక్నాలజీని మరింతగా మెరుగుపర్చడంపై ఆటోమొబైల్ కంపెనీలు ఫోకస్ పెట్టాయి. ఫ్యూచర్‌లో ఎలక్ట్రానిక్, సౌర వాహనాల వినియోగం పెరిగితే అరబ్ దేశాల పెట్రోలు, డీజిల్‌కు డిమాండ్ తగ్గిపోతుంది. ఇక కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ‘వేవ్ మొబిలిటీ’ సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం EVAను ఇవాళ విడుదల చేసింది. దీని ధర రూ.3.25 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా ఉంటుందట. ఈ వాహనంలో నివా, స్టెల్లా, వేగా అనే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో రెండు వాహన(Solar EV) వేరియంట్ల రేట్లు రూ.5 లక్షలలోపు ఉంటాయట. తొలి 25వేల మంది కస్టమర్లకు ఈ రేట్లతో వాహనాలను విక్రయిస్తారు. ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
Also Read :Attack On Kejriwals Car : కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఇది ఎవరి పని ?
‘వేవ్ మొబిలిటీ’ కంపెనీకి చెందిన EVA సోలార్ వాహనం ఉత్పత్తి ప్రక్రియ 2026లో మొదలుకానుంది. 2026 సంవత్సరం మే నాటికి ఈ వాహనాలను వినియోగదారులకు డెలివరీ చేయనున్నారు. తొలి విడతలో ఈ వాహనాలను పూణే, బెంగళూరు నగరాల్లో ఉన్న షోరూంలలో విక్రయించనున్నారు. తదుపరిగా దశల వారీగా దేశంలోని వివిధ నగరాల్లో EVA సోలార్ వాహనాలను అమ్ముతారు.
Also Read :Bihar Next CM : లాలూ కుమారుల ఢీ.. ‘‘నెక్ట్స్ సీఎం నేనే’’ అంటూ తేజ్‌ప్రతాప్ సంచలన వీడియో
‘వేవ్ మొబిలిటీ’కి చెందిన సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం EVAను తొలిసారిగా 2023 సంవత్సరంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. దీనిపై ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానల్ రూఫ్ ఉంటుంది. సగటున ఇద్దరు ప్రయాణికులతో, ప్రతిరోజూ సగటున 35 కి.మీ మాత్రమే ప్రయాణించే వారికి తమ వాహనం చాలా బాగుంటుందని ‘వేవ్ మొబిలిటీ’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నీలేశ్ బజాజ్ వెల్లడించారు. 1 కిలోమీటరు ప్రయాణానికి సగటున 0.5 పైసలు మాత్రమే ఖర్చవుతుందన్నారు.