Best two wheelers: బడ్జెట్ ధరలో టూ వీలర్స్ కోసం చూస్తున్నారా.. అయితే ఒక లక్కేయండి?
బడ్జెట్ ధరలో టూవీలర్ బైక్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నా వారు ఈ బైక్స్ పై ఒక లుక్ వెయ్యండి.
- By Anshu Published Date - 02:00 PM, Tue - 27 August 24

ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనాల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఒక ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. పెద్ద పెద్ద ఫ్యామిలీకలో ఒకటి కంటే ఎక్కువగా వాహనాలను కూడా వినియోగిస్తున్నారు. ఇంకా రోజురోజుకి వీటి కొనుగోలు దారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కానీ చాలామంది మార్కెట్లో ఉండే బైకుల వివరాలు ఏది మంచిదో తెలియక వెనకడుగు వేస్తుంటారు. అలాగే ముఖ్యంగా చాలా వరకు బడ్జెట్ ధరలు ఉన్న టూ వీలర్స్ కోసమే ఎక్కువ శాతం మంది ఎదురు చూస్తూ ఉంటారు. మరి మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే బడ్జెట్ టూ వీలర్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టీవీఎస్ జూపిటర్ 110.. ప్రముఖ కంపెనీ టీవీఎస్ నుంచి విడుదలైన జుపీటర్ 110 ద్విచక్ర వాహనం ఆకట్టుకుంటోంది. దీనితో ఆ కంపెనీ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను నవీకరించింది. ఈ వాహనం బేస్ మోడల్ రూ.73,700కు అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ ట్రిమ్ కోసం 87,250 వెచ్చించాలి. బడ్జెట్ ధరలో ఉన్న బైక్స్ లో హోండా యాక్టివా 6జీ బైక్ కూడా ఒకటి. టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ తర్వాత రెండో ప్రత్యామ్నాయంగా హోండా యాక్టివా 6జీని చెప్పవచ్చు. దీని టాప్ స్పెక్ హెచ్ స్మార్ట్ వేరియంట్ 82,684 కు అందుబాటులో ఉంది. దీనిలో 109 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.73 బీహెచ్ పీ, 8.90 ఎన్ఎమ్ ను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా ఎల్ఈడీ హెడ్‌లైట్, సైలెంట్ స్టార్టర్, సీటును తెరవడానికి డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, పెట్రోల్ క్యాప్, కీలెస్ ఆపరేషన్ లాంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అదేవిధంగా హీరో కంపెనీ నుంచి విడుదలైన స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనానికి ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ద్విచక్ర వాహనాల మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బండి అని చెప్పవచ్చు. స్ప్లెండర్ ప్లస్ 97.2సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో వస్తోంది. 8,000 ఆర్ పీఎం వద్ద 7.91 బీహెచ్పీ, 6,000 ఆర్ఫీఎం వద్ద 8.05 ఎన్ఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కు నాలుగు స్పీడ్ గేర్ బాక్స్‌తో అనుసంధానం చేశారు. ఈ బండి రూ. 78,286 కు అందుబాటులో ఉంది. అలాగే బడ్జెట్ ధరలో లభిస్తున్న బైక్స్ లో హోండా షైన్ బైక్ కూడా ఒకటి. దీనిలోని 123సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 10.59 బీహెచ్ పీ, 11 ఎన్ ఎమ్ ఉత్తత్తి చేస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ స్ప్రింగ్‌ల కారణంగా ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది. బ్రేకింగ్ హార్డ్‌వేర్ ఫ్రంట్, రియర్ డ్రమ్, రియర్ డ్రమ్ బ్రేక్ సెటప్‌తో ఆకట్టుకుంటుంది. హోండా షైన్ డిస్క్ వాహనం రూ.84,250కు లభిస్తుంది.