TVS Raider: అద్భుతమైన ఫీచర్ లతో టీవీఎస్ కొత్త బైక్.. ధర ఫీచర్లు ఇవే?
ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ తాజాగా మరొక సరికొత్త బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. కాగా టీవీఎస్
- By Nakshatra Published Date - 04:15 PM, Fri - 28 October 22
ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ తాజాగా మరొక సరికొత్త బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. కాగా టీవీఎస్ సంస్థ గతంలో 125 సిసి సెగ్మెంట్ లో ఒక రైడర్ బైక్ ను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా టీవీఎస్ సంస్థ రైడర్ 125 బైక్ ను అత్యధిక ఫీచర్ లతో తీసుకువచ్చింది. గత బైక్ లో ఉన్న ఫీచర్ లు ఇందులో కొన్నో ఉన్నాయి. అయితే ఇంజిన్ లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ సాంకేతికంగా ఈ బైక్‌ను తీర్చిదిద్దింది టీవీఎస్.
ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ టీవీఎస్ రైడర్ 125 బైక్ ధర విషయానికి వస్తే రూ.99,999 ఎక్స్‌షోరూమ్ గా ఉంది. ఇప్పటికే ఈ రైడర్ 125 బైక్ కి సంబంధించిన బుకింగ్స్ మొదలైనట్లు కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ లో ఐదు అంగుళాల టిఎఫ్ టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను అమర్చడంతో పాటు టైం, ట్రిప్ మీటర్, యావరేజ్ స్పీడ్, రైడింగ్ మోడ్, గేర్ పొజిషన్, ఇండికేటర్లు వంటివి ఉన్నాయి. బైక్ లో స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ తో స్మార్ట్ టీచర్లు అందిస్తున్నారు టీవీఎస్ సంస్థ. మొత్తంగా 99 రకాల కనెక్టెడ్ ఫీచర్లు అందిస్తున్నట్లుగా కంపెనీ తమ అధికారిక వెబ్ సైట్ లో తెలిపింది.
ఈ రైడర్ 125 బైక్ స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే ఇందులో 124.8 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్‌ను అమర్చగా అది 11.4 హెచ్‌పీ పవర్‌ను 11.2 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ బైక్ లో ఎకో, పవర్ అనే రెండు రకాల మోడ్స్ లభిస్తాయి. కేవలం 5.9 సెకన్లలోనే 0-60 వేగాన్ని అందుకుంటుందని, గరిష్ఠంగా 99 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్తుందని కంపెనీ వెల్లడించింది. అదేవిదంగా ఈ బైక్ కి ఎల్ ఈడీ హెడ్, టెయిల్ ల్యాంప్ లను కూడా అమర్చారు. ఈ సరి కొత్త బైక్ మనకు నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
Related News
OnePlus Nord CE 4: అద్భుతమైన ఫీచర్లతో అదరగొడుతున్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. తక్కువ బడ్జెట్ కే?
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే.