Vikram Lander : జాబిల్లిపై మన ల్యాండర్ ఎలా ఉందో తెలుసా ..?
గత నెల 15న అంతరిక్షంలో తిరుగుతున్న ఓ ఉపగ్రహం సాయంతో సుమారు 65 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసినట్లు తెలిపింది
- Author : Sudheer
Date : 02-05-2024 - 2:24 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ( Vikram lander), ప్రగ్యాన్ రోవర్ (Pragyan Rover) జాబిల్లి(Moon)ఫై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా జాబిల్లి ఫై అడుగుపెట్టి ఇస్రో (ISRO) చరిత్ర సృష్టించింది. అయితే అడుగుపెట్టిన తర్వాత అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫొటోస్ ద్వారా తెలియజేస్తూ వచ్చింది. కాగా కొన్ని రోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్ కు అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. జాబిల్లి ఉపరితలంపై రాత్రిపూట మైనస్ 200 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ల లోపల అమర్చిన పలు పరికరాలు దెబ్బతిన్నాయని ఇస్రో తెలిపింది. సూర్యరశ్మితో సోలార్ ప్యానెళ్ల ద్వారా వాటిని రీచార్జ్ చేసేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
విక్రమ్, ప్రగ్యాన్ ల ప్రయోగం వెనక తమ లక్ష్యం జాబిల్లిపై సేఫ్ గా ల్యాండవడమేనని, రోవర్ తో చిన్నపాటి ప్రయోగాలను విజయవంతంగా చేశామని ఇస్రో తెలిపి.. చంద్రయాన్ – 3 ప్రయోగ లక్ష్యం నెరవేరిందన్నారు. ఇస్రో విజయానికి గుర్తుగా అవి రెండూ చంద్రుడి ఉపరితలంపై ఎప్పటికీ ఉండిపోతాయని చెప్పుకొచ్చారు. తాజాగా విక్రమ్ ల్యాండర్ తో పాటు ప్రగ్యాన్ రోవర్ ను ఫొటోలు తీసినట్లు ఇస్రో వెల్లడించింది. గత నెల 15న అంతరిక్షంలో తిరుగుతున్న ఓ ఉపగ్రహం సాయంతో సుమారు 65 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసినట్లు తెలిపింది. ఈ ఫొటోలను గురువారం మీడియాకు రిలీజ్ చేసింది. తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తిచేసిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ లు జాబిల్లిపై శాశ్వతంగా రెస్ట్ తీసుకుంటున్నాయని క్యాప్షన్ జతచేసింది.
Read Also : Movies – IPL : ఒక దర్శకుడు ఐపీఎల్ పై అసహనం.. మరో ఇద్దరు డైరెక్టర్స్ ఐపీఎల్‌తోనే ప్రమోషన్స్..