Toyota e-Palette: టయోటా నుంచి కొత్త వాహనం.. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు జర్నీ!
టయోటా ఈ ఎలక్ట్రిక్ కారులో లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలలో కనిపించే సాంకేతికతనే ఇందులో వాడారు.
- By Gopichand Published Date - 06:58 PM, Wed - 22 October 25

Toyota e-Palette: ఆటోమొబైల్ పరిశ్రమలో వరుసగా కొత్త వాహనాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో టయోటా కంపెనీ ‘ఈ-ప్యాలెట్’ (Toyota e-Palette) పేరుతో ఒక ఎలక్ట్రిక్ షటిల్‌ను విడుదల చేసింది. దీని ధర 29 మిలియన్ యెన్ (సుమారు 1.74 కోట్ల రూపాయలు)గా నిర్ణయించారు.
ప్రస్తుతం లెవెల్ 2 ఆటోమేటెడ్ డ్రైవింగ్
ప్రస్తుతానికి ఈ షటిల్‌లో లెవెల్ 2 ఆటోమేటెడ్ డ్రైవింగ్ (Level 2 Automated Driving) టెక్నాలజీని అందించారు. అయితే భవిష్యత్తులో పూర్తిగా డ్రైవర్ లేకుండా నడిచేలా మరింత అధునాతన వ్యవస్థను టయోటా అభివృద్ధి చేస్తోంది.
‘మల్టీ-ఫంక్షనల్ మొబిలిటీ’కి రూపం
టయోటా e-Palette అనేది పూర్తిగా బ్యాటరీ-ఎలక్ట్రిక్ వెహికల్ (BEV). దీనిని ముఖ్యంగా స్మార్ట్ సిటీ ట్రాన్స్‌పోర్ట్, షటిల్ సేవలు, మల్టీ-ఫంక్షనల్ మొబిలిటీ అవసరాల కోసం రూపొందించారు. రాబోయే సంవత్సరాల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని కూడా జోడించాలనే టయోటా ‘మొబిలిటీ యాజ్ ఎ సర్వీస్’ (MaaS) విజన్‌లో ఈ వాహనం ఒక భాగం.
Also Read: Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆటగాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!
ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం?
టయోటా ఈ-ప్యాలెట్ ఒక పర్పస్-బిల్ట్ వెహికల్ (PBV). ఇందులో శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు. దీని కారణంగా ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ వాహనం సాఫీగా కదులుతుంది. దాని గరిష్ట వేగం (Top Speed) సుమారు 80 కిమీ/గంగా ఉంది. అంటే రద్దీ ఉన్న ప్రాంతాలకు, చిన్న పట్టణాలకు ఇది సరైన ఎంపిక. ఈ వాహనంలో ఒకేసారి 17 మంది సులభంగా కూర్చోవచ్చు.
వాహనం ధర- లభ్యత
టయోటా దీనిని ఆధునిక సాంకేతికతతో తయారు చేసింది. ఇది సొంతంగా నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం దీన్ని నడపడానికి డ్రైవర్ అవసరం అయినప్పటికీ భవిష్యత్తులో ఇది పూర్తిగా ఆటోమేటిక్‌గా మారవచ్చు. ఈ షటిల్ ధర దాదాపు 1.7 కోట్లుగా ఉంది. ఇది ప్రస్తుతం జపాన్‌లో అందుబాటులో ఉంది. త్వరలో దీనిని ఇతర దేశాలకు కూడా తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
బ్యాటరీ వివరాలు
టయోటా ఈ ఎలక్ట్రిక్ కారులో లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలలో కనిపించే సాంకేతికతనే ఇందులో వాడారు. దీని బ్యాటరీ సామర్థ్యం సుమారు 72.8 kWhగా ఉంది. ఈ బ్యాటరీ ఎక్కువ శక్తిని నిల్వ చేయగలదు. దీనివల్ల వాహనం ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలవుతుంది. ఈ-షటిల్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.