HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >These Are The Best Affordable Motorcycles In India

Top Bikes Under 1Lakh: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో అదరగొడుతున్న బైక్స్.. టాప్ లో ఆ బైక్?

ప్రస్తుతం భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు భారీగా డిమాండ్ ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు

  • Author : Anshu Date : 01-04-2024 - 10:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bike Maintain
Bike Maintain

ప్రస్తుతం భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు భారీగా డిమాండ్ ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు అందుకు అనుగుణంగా కొత్త కొత్త వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ద్విచక్ర వాహనాలు విక్రయాలు చేసే దేశాల్లో మన దేశం కూడా ఒకటి. ఇక్కడి ఆటో మొబైల్ మార్కెట్ చాలా పెద్దది. ఇక్కడ సాధారణంగా 100 నుంచి 110 సీసీ ఇంజిన్ సెగ్మెంట్ కమ్యూటర్ మోటార్ సైకిళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇటీవల కాలంలో వినియోగదారుల ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నందున ప్రీమియం మోటార్‌సైకిళ్లకూ డిమాండ్ పెరుగుతోంది.

ప్రత్యేకించి అధిక పనితీరు, అత్యాధునిక సాంకేతిక-సహాయక ఫీచర్లను కోరుకునే యువ కొనుగోలుదారుల వల్ల ఈ డిమాండ్ పెరుగుతోంది. అయినప్పటికీ అత్యధిక శాతం కొనుగోలుదారులు బైక్ ధర, దాని మైలేజీనే ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మన దేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ బైక్స్ అది కూడా రూ. 1లక్ష లోపు ధర, అధిక మైలేజీ అందించే బైక్స్ ను అందిస్తున్నాం. ఇంతకీ ఆ బైక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హీరో స్ప్లెండర్ ప్లస్.. ఇతర మోటార్‌ సైకిళ్లు, స్కూటర్‌ల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ స్ప్లెండర్ ఇప్పటి వరకు భారతదేశంలో బెస్ట్ సెల్లర్ ద్విచక్ర వాహనంగా కొనసాగుతోంది. స్ప్లెండర్ సిరీస్ అనేక మోడళ్లను కలిగి ఉంది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. హీరో స్ప్లెండర్ ప్లస్‌లో 97.2 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ 7.91 బిహెచ్‌పి పీక్ పవర్ , 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపు 80 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 75,141 నుంచి రూ. 77,986 మధ్య ఉంది.

హోండా ఎస్పీ 125…ఈ బైక్ ధర రూ. 86,017 నుంచి 90,017 మధ్య ఉంది. ఇది పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ ఉంటుంది. ఈ మోటార్‌ సైకిల్ ఐదు స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడిన 123.94 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 10.72 బీహెచ్పీ గరిష్ట శక్తి, 10.9 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్.. ఇది దేశంలోనే కాకుండా విదేశీ మార్కెట్‌ లలో కూడా ప్రజాదరణ పొందింది. ఇది తొమ్మిది శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని చెప్పుకునే i3S టెక్నాలజీని పొందుతుంది. దీనిలో 97.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ నాలుగు స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది. ఈ ఇంజన్ 7.91 బీహెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 59,998 నుంచి 68,768 ఉంటుంది.

హోండా షైన్ 125.. ఇటీవల కాలంలో ఎక్కువశాతం మంది 100సీసీ కన్నా కూడా 125సీసీ బైక్స్ కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. హోండా దీనిపై ఫోకస్ పెట్టి 125 సీసీ బైక్స్ ను ఎక్కువగా లాంచ్ చేస్తోంది. దీనిలో ప్రధానంగా షైన్ 125 కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని ధర రూ. 79,800 నుంచి 83,800 మధ్య ఉంటుంది. దీనిలో 123.94సీసీ ఇంజన్, 10.59 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 11 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో గ్లామర్.. హీరో గ్లామర్ అనేది హీరో మోటో కార్ప్ నుంచి హోండా షైన్ 125,హోండా ఎస్పీ 125 లకు పోటీగా తీసుకొచ్చిన బైక్. దీని ధర రూ.80,908 నుంచి 86,348 వరకూ ఉంటుంది . ఈ మోటార్‌ సైకిల్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ ఛార్జర్, 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ను పొందుతుంది. ఈ బైక్ లో 124.7 సీసీ ఇంజిన్ 10.39 బీహెచ్పీ గరిష్ట శక్తి, 10.4ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6.7 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • motorcycles
  • Top Bikes
  • Top Bikes Under 1Lakh

Related News

Election Dates

దేశంలో మ‌రోసారి ఎల‌క్ష‌న్స్‌.. 4 రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే!

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

  • Modi Speech

    Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

  • Kerosene

    Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Mobile Number Numerology

    Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

  • Donald Trump : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన మిత్రదేశాలు

  • ఈ ఎన్నిక‌ల‌కు ప‌ర్పుల్ మార్క‌ర్‌ను ఉప‌యోగిస్తార‌ని మీకు తెలుసా?

  • Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు !!

  • ఏప్రిల్ నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd