Tata – BMW : టాటాతో చేతులు కలిపిన బీఎండబ్ల్యూ.. ఏం చేయబోతున్నాయంటే..
ఇందులో భాగంగా బీఎండబ్ల్యూ టెక్ వర్క్స్ ఇండియా విభాగంతో కలిసి టాటా టెక్ (Tata - BMW) ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది.
- By Pasha Published Date - 01:06 PM, Wed - 9 October 24

Tata – BMW : టాటా గ్రూపు చాలా పెద్దది. ఇందులోని కంపెనీలు విభిన్న రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీలు ఇతరత్రా ప్రముఖ కంపెనీలతో చేతులు కలుపుతూ వ్యాపార దక్షతను చాటుకుంటున్నాయి. తమ వ్యాపార విస్తరణకు అవసరమైన టెక్నాలజీని, ఇతరత్రా వనరులను సమకూర్చుకునేందుకు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. తాజాగా టాటా టెక్నాలజీస్ కంపెనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా బీఎండబ్ల్యూ టెక్ వర్క్స్ ఇండియా విభాగంతో కలిసి టాటా టెక్ (Tata – BMW) ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇందులో చెరో 50 శాతం వాటా ఈ కంపెనీలకు ఉంటుంది. ఈ రెండు కంపెనీలు కలిసి వాహనాలకు అవసరమైన సరికొత్త సాఫ్ట్‌వేర్లను తయారు చేయనున్నాయి.
Also Read :Train Accident : రైలు పట్టాలపై సిమెంటు దిమ్మెలు.. తప్పిన పెను ప్రమాదం
సాఫ్ట్‌వేర్ ఆధారంగా నడిచే వాహన టెక్నాలజీ (ఎస్‌డీవీ), ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీ, వాహనాల్లో వాడే ఏఐ యాప్స్, వాహన వ్యాపారానికి సంబంధించిన ఐటీ సొల్యూషన్స్, వాహనాల్లో వాడే ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లను ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని నిపుణులు తయారు చేయనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా బీఎండబ్ల్యూ టెక్ వర్క్స్ కంపెనీ పూణే, బెంగళూరు, చెన్నైలలో ఆఫీసులు ఏర్పాటు చేయనుంది. జాయింట్ వెంచర్ కంపెనీలోకి దాదాపు 100 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నారు. 2025 చివరికల్లా మానవ వనరుల సంఖ్యను 1000 దాటించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భారతీయ ఇంజినీరింగ్ నిపుణులకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
Also Read :Poonam Kaur : ఆ దర్శకుడు గర్భవతిని చేశాడంటూ పూనమ్ కౌర్ ట్వీట్
టాటా ప్లే కొనుగోలుకు ఎయిర్ టెల్ చర్చలు
మరోవైపు టాటా గ్రూపునకు చెందిన టాటా ప్లేను కొనుగోలు చేసేందుకు భారతీ ఎయిర్ టెల్ చర్చలు జరుపుతోంది. టాటా ప్లేను కొనేయడం ద్వారా డిజిటల్ టీవీ వ్యాపారంలో జియోను ఢీకొనాలని ఎయిర్ టెల్ ప్లాన్ చేస్తోంది. టాటా ప్లే వేదికపై ఉన్న ఓటీటీ వంటి ప్లాట్‌ఫామ్స్‌ను ఎయిర్ టెల్ కోసం సమర్ధంగా వాడుకోవాలని యోచిస్తోంది. టాటా ప్లే సబ్‌స్క్రయిబర్లు అందరూ తమకు బదిలీ అయితే డిజిటల్ టీవీ, డీటీహెచ్ వ్యాపారంలో ముందడుగు వేయొచ్చని ఎయిర్ టెల్ ఆశిస్తోంది.