Poonam Kaur : ఆ దర్శకుడు గర్భవతిని చేశాడంటూ పూనమ్ కౌర్ ట్వీట్
Poonam : ఇండస్ట్రీలోని ఓ దర్శకుడు ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆపై అబార్షన్ చేయించి ఆమె కెరీర్‌ను నాశనం చేశాడని ఎక్స్ వేదికగా ఆరోపించింది.
- By Sudheer Published Date - 12:39 PM, Wed - 9 October 24

పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్ చేసి ఇండస్ట్రీ లో కాకరేపింది. పూనమ్ (Poonam Kaur) సినిమాలకన్నా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులార్టీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నిత్యం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) ల ఫై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. నిజంగా వారి వల్ల ఈమె ఎంత నష్టపోయిందో తెలియదు కానీ..బయట మాత్రం పూనమ్ కౌర్ కెరియర్ ను వీరిద్దరే నాశనం చేసారని మాత్రం ఓ వర్గం ప్రచారం చేస్తుంటుంది. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా పూనమ్ సైతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేయడం , విమర్శలు , ఆరోపణలు చేయడం చేస్తుంటుంది. ఈ మధ్య అయితే డైరెక్ట్ గా త్రివిక్రమ్ పేరు పెట్టె విమర్శలు చేస్తుంది.
తాజాగా ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇండస్ట్రీలోని ఓ దర్శకుడు ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆపై అబార్షన్ చేయించి ఆమె కెరీర్‌ను నాశనం చేశాడని ఎక్స్ వేదికగా ఆరోపించింది. ‘మా’ జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికిందని పేర్కొంది. అతడు రాజకీయ నాయకుడిగా మారిన నటుడు కాదని స్పష్టం చేసింది. అయితే, ఈ విషయంలోకి తనను, ఆ నేతను అనవసరంగా లాగారని పూనమ్ కౌర్ వాపోయింది. ఈ పోస్టులో పూనమ్ ఎవరి పేర్లనూ ప్రస్తావించకపోవడం తో వారు ఎవరై ఉంటారని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
clarification –
it’s not the actor turned politician who impregnated n aborted the girl which ended her career – it’s the director who did it -maa involvement helped the half punjabi actor , I and actor/politician were pulled unnecessarily due political desperation #punjabigirl.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 9, 2024
Read Also : Train Accident : రైలు పట్టాలపై సిమెంటు దిమ్మెలు.. తప్పిన పెను ప్రమాదం