Nexon CNG Car: ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో టాటా నెక్సాన్ సీఎన్‌జీ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో కూడిన ట్రాక్టర్ నెక్సాన్ సీఎన్‌జీ కార్ విడుదల కాబోతోంది.
- By Anshu Published Date - 11:30 AM, Mon - 26 August 24

భారత మార్కెట్ లో టాటా మోటార్స్ కంపెనీకి ఉన్న గుర్తింపు గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే మార్కెట్ లోకి టాటా మోటార్స్ నుంచి పలు కార్లు విడుదలైన విషయం తెలిసిందే. ఆటో మేటిక్ గేర్‌బాక్స్ తో కూడిన టియాగో, టిగోర్ సీఎన్‌జీ కార్లు కొన్ని నెలల క్రితం భారత మార్కెట్లోకి విడుదల అయ్యాయి. అయితే ప్రస్తుతం సీఎన్‌జీ పవర్డ్ నెక్సాన్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది టాటా మోటార్స్. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఇది సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలోనే రాబోతున్న ఈ కొత్త టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఎస్‌యూవీలో 5 స్పీడ్ మ్యాన్యువల్/5 స్పీడ్ ఆటో మేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుందని తెలిసింది.
ఇది 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ 3 సిలిండర్ ఇంజిన్ ను పొందుతుంది. ఇది గరిష్టంగా 100 పిఎస్ శక్తిని, 150 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుందట. కాగా ఈ సరికొత్త టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఎస్‌యూవీ గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 26.99 km/కేజీ మైలేజీని అందజేస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ కారు ధర రూ.9.25 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. ఇది అధునాతన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంధనంతో నడిచే దాదాపు నెక్సాన్ కారుతో పోల్చవచ్చు. ట్విన్‌లో 60 లీటర్ సీఎన్‌జీ ట్యాంక్ ఉండనుంది. ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 230 కెపాసిటీ గల బూట్ స్పేస్ ను కలిగి ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దేశీయంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఇంధనంతో నడిచే నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.8 లక్షల నుండి రూ.15.80 లక్షల మధ్య ఉంది.
ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ లు ఉన్నాయి. ఇది వేరియంట్ లను బట్టి 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటో మేటిక్, 7 స్పీడ్ DCT ను కలిగి ఉంటుంది. అలాగే ఈ నెక్సన్ కారు 17.01 నుండి 24.08 kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇక దీని ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య గా నడుస్తోంది.