HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Safest Suv Cars In India 5 Top Brand Cars With 5 Star Safety Rating

Safest SUVs in India: భారత్‌లో ఉన్న 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కలిగిన టాప్ 5 ఎస్‌యూవీ కార్లు ఇవే .. ధర, ఫీచర్స్ ఇవే?

భారత మార్కెట్లోకి ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లు కలిగిన కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల

  • Author : Anshu Date : 22-02-2024 - 3:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 22 Feb 2024 07 14 Pm 5017
Mixcollage 22 Feb 2024 07 14 Pm 5017

భారత మార్కెట్లోకి ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లు కలిగిన కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల అయిన వాటితో పాటు కొత్త కొత్త కార్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఎక్కువగా 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లకు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ పెరుగుతోంది. భద్రతపరమైన ఫీచర్లను కలిగిన కార్లవైపే వినియోగదారులు కూడా మొగ్గు చూపుతున్నారు. దాంతో ఆయా సంస్థలు కూడా 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి అన్న విషయానికి వస్తే.. కొత్త టాటా సఫారి గ్లోబల్ ఎన్‌సీఎపీలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలు రెండింటిలోనూ 5 స్టార్ స్కోర్ చేసింది. టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 34 పాయింట్లకు 33.05 పాయింట్లను సాధించగా, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు 45 పాయింట్లను అందుకుంది. సఫారీలో మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రామాణికంగా వస్తుంది. ఈ కారు ధర రూ. 16.19 లక్షల నుంచి రూ. 27.34 లక్షలు మధ్య ఉంటుంది.

టాటా హారియర్… కొత్త టాటా హారియర్, టాటా సఫారీలు ఆర్కిటెక్చర్‌పై రూపొందించారు. ల్యాండ్ రోవర్ డీ8 ప్లాట్‌ఫారమ్ నుంచి వచ్చింది. ఈ రెండు ఎస్‌యూవీలు గ్లోబల్ ఎన్‌సీఏపీలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలలో ఒకే విధమైన స్టార్‌లు, పాయింట్లను సాధించాయి. ఈ రెండు కారు మోడల్స్ భారత్ ఎన్‌సీఏపీ వద్ద కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. టాటా హారియర్ కారు ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 26.44 లక్షల పరిధిలో అందుబాటులో ఉంది.

టాటా నెక్సాన్.. కొత్త టాటా నెక్సాన్ స్వదేశీ మార్కెట్ నుంచి వచ్చిన మరో ఎస్‌యూవీ మోడల్. గ్లోబల్ ఎన్‌సిఎపిలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలు రెండింటిలోనూ 5 స్టార్ స్కోర్ చేసింది. గతంలో 32.22 పాయింట్లు, 44.52 పాయింట్లను సాధించింది. నెక్సాన్ కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ స్టాండర్డ్‌తో వస్తుంది. ఈ కారు ధర రూ. 8.15 లక్షలతో మొదలై రూ. 15.60 లక్షల వరకు ఉంటుంది.

వోక్స్‌వ్యాగన్ టైగన్.. వోక్స్‌వ్యాగన్ టైగన్ గ్లోబల్ ఎన్‌సీఎపీలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలు రెండింటికీ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఎస్‌యూవీ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 29.64 పాయింట్లను సంపాదించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 42 పాయింట్లను పొందింది. సఫారీ, హారియర్, నెక్సాన్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ స్టాండర్డ్‌గా ఉండగా, టైగన్ ఈఎస్‌సీతో కేవలం 2 ఎయిర్‌బ్యాగ్‌లను మాత్రమే ప్రామాణికంగా కలిగి ఉంది. టైగన్ ధర రూ. 11.70 లక్షల నుంచి రూ. 20 లక్షలుకు అందుబాటులో ఉంది.

స్కోడా కుషాక్.. గ్లోబల్ ఎన్‌సీఏపీలో వోక్స్‌వ్యాగన్ టైగన్ రేటింగ్‌లకు సమానంగా స్కోడా కుషాక్ రేటింగ్‌లను కలిగి ఉంది. భారత్ 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా రెండూ వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. కుషాక్ ధర రూ. 11.89 లక్షల నుంచి రూ. 20.49 లక్షలు ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5star safety rating
  • brand cars
  • india
  • Safest SUVs in India
  • SUV

Related News

Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • A new chapter in India-Japan relations

    India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd