Odyssey Electric: ఒక్క ఛార్జ్.. 125 కిమీ రేంజ్.. కేవలం 999తో బుకింగ్!
ఎలక్ట్రిక్ బైకులకు ఆదరణ పెరుగుతోంది. ఈ కీలక తరుణంలో ఒడిస్సే ఎలక్ట్రిక్ తన రెండో ఎలక్ట్రిక్ బైకుని అధికారికంగా విడుదల చేసింది.
- By Maheswara Rao Nadella Published Date - 06:00 PM, Sat - 1 April 23
Odyssey Electric Releases Vader Electric Bike : ఎలక్ట్రిక్ బైకులకు ఆదరణ పెరుగుతోంది. ఈ కీలక తరుణంలో ఒడిస్సే ఎలక్ట్రిక్ (Odyssey Electric) తన రెండో ఎలక్ట్రిక్ బైకుని అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి మంచి రేంజ్ అందించేలా రూపుదిద్దుకుంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ధర & బుకింగ్స్..
కొత్త ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ (Odyssey Vader Electric) బైక్ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్ – షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ కోసం మార్చి 31 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారం భించింది. కావున ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జులైలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
డిజైన్..
ఈ బైక్ ఆకర్శించే డిజైన్ లో ఉంది. ఇది డ్యూయెల్ టోన్ ఫినిష్, ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్‌లైట్, హాలోజెన్ ఇండికేటర్స్, స్ప్లిట్ సీట్స్, స్పోర్టీ డెకల్స్, అలాయ్ వీల్స్, చిన్న ఫ్లై స్క్రీన్ వంటి వాటిని కలిగి ఉంది. అంతే కాకుండా ఈ బైక్ 14 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.
ఫీచర్స్..
- 7 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీఎఫ్టీ టచ్‌స్క్రీన్.
- దీని ద్వారా బ్లూటుత్ కనెక్టివిటీ ఆప్షన్ పొందటమే కాకుండా.. బైక్ లొకేటింగ్, జియో ఫెన్సింగ్, లో బ్యాటరీ అలర్ట్, యాంటీ-థెఫ్ట్ వంటి సమాచారం తెలుసుకోవచ్చు.
- IP67 రేటెడ్ 3.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగిన హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్.
- ఇది 170 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
- ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 125 కిమీ రేంజ్ అందిస్తుంది.
- రేంజ్ అనేది రైడర్ ఎంచుకునే రైడింగ్ మోడ్ మీద ఆధారపడి ఉంటుంది.
- బ్యాటరీ కేవలం 4 గంటల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.
Also Read: Alto 800 Maruti Suzuki: “ఆల్టో 800” అల్ విదా.. ఉత్పత్తి ఆపేసిన మారుతీ సుజుకీ
Tags
Related News
Ather Rizta vs Ola S1 Pro: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది మంచిది..? ఫీచర్లు, ధర వివరాలివే..!
భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఇ-స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ మధ్య గట్టి పోటీ ఉంది.