BEER MOTORCYCLE : బీర్ బైక్.. గంటకు 241 కి.మీ స్పీడ్ ?
- By Pasha Published Date - 12:00 PM, Sun - 14 May 23

పెట్రోల్ తో నడిచే బైక్స్, టూ వీలర్స్ మనం చూశాం.. ఎలక్ట్రిక్ బ్యాటరీ తో నడిచేవి చూశాం.. సోలార్ సెల్స్ తో నడిచేవి చూశాం.. విండ్ ఎనర్జీతో నడిచేవి చూశాం.. కానీ అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన కీ మైఖేల్ సన్ (Ky Michaelson) అనే ఔత్సాహిక వ్యక్తి.. వీటి కంటే వెరైటీ పద్ధతిలో నడిచే బైక్ ను తయారు చేసేందుకు ప్లాన్ చేశాడు. బాగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన అతగాడికి ఒక వెరైటీ ఐడియా వచ్చింది. మద్యం ప్రియులు తప్పతాగి తిరుగుతుంటారు.. బైక్ (BEER MOTORCYCLE) మాత్రం బీర్ తాగి ఎందుకు తిరగకూడదు ? అనే ప్రశ్న కీ మైఖేల్ సన్ బ్రెయిన్ లో ఉదయించింది. దీంతో తన గ్యారేజీలో చెమటోడ్చి.. బీరుతో నడిచే మోటార్‌సైకిల్(BEER MOTORCYCLE) ను కనుగొన్నాడు.
బైక్ ఇలా పనిచేస్తుంది..
సాధారణ బైక్ లలో గ్యాస్ శక్తితో పనిచేసే ఇంజన్ ఉంటుంది. కానీ కీ మైఖేల్ సన్ తయారు చేసిన బీర్ బైక్ లో ఇంజన్ ప్లేస్ లో హీటింగ్ కాయిల్ ఉంటుంది. దీని కెపాసిటీ 14 గ్యాలన్లు (ఒక కేఈజీ). ఇందులో బీర్‌ను వేసి.. కిక్ కొట్టగానే 300 డిగ్రీల సెల్సీయస్ వరకు హీటింగ్ కాయిల్ వేడెక్కుతుంది. ఇది సూపర్ హీటెడ్ స్టీమ్‌గా మారి బైక్ సైలెన్సర్ లోని నాజిల్‌లోకి వెళ్లి మోటార్‌సైకిల్ కు ముందుకు నడిచే ఎనర్జీని అందిస్తుంది. గ్యాస్ ధరలు.. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ టైంలో తక్కువ రేటుకు మద్యం తయారు చేసి బైక్ లు నడిపితే చాలా బాగుంటుందని కీ మైఖేల్ సన్ అంటున్నాడు. తన బైక్ ఫోటోలను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక .. నెటిజన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ‘నీ లాంటి వ్యక్తులు మరింత మంది కావాలయ్య’ అంటూ కామెంట్స్ పెట్టారు.
ALSO READ : RELIANCE CARS : కార్ల తయారీలోకి రిలయన్స్.. MG మోటార్ పై కన్ను ?
మిన్నెసోటా సిటీలో ఇటీవల జరిగిన కార్ అండ్ బైక్ షోలోతన బీర్ బైక్ ను ప్రదర్శించగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని కీ మైఖేల్ సన్ (Ky Michaelson) చెప్పాడు. తన బైక్ గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపాడు. కొందరు నెటిజన్స్ కీ మైఖేల్ సన్ ను ‘రాకెట్‌మ్యాన్’గా పిలుస్తున్నారు. ఇలాంటి ఆవిష్కరణలు చేసేవాళ్ళు ఇంకా చాలామంది కావాలి అని అభిప్రాయపడుతున్నారు.