Digital Car Key : తాళం లేకుండానే కారును లాక్, అన్‌లాక్ చేయండిలా
Digital Car Key : తాళం లేకుండానే కారును లాక్, అన్‌లాక్, స్టార్ట్ చేయగలిగితే.. ఎలా ఉంటుంది ? అది సాధ్యమే !!
- By Pasha Published Date - 03:26 PM, Tue - 26 March 24
Digital Car Key : తాళం లేకుండానే కారును లాక్, అన్‌లాక్, స్టార్ట్ చేయగలిగితే.. ఎలా ఉంటుంది ? అది సాధ్యమే !! ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ తెచ్చిన ‘డిజిటల్ కీ’ ఫీచర్‌తో మనం తాళం లేకుండానే కారును లాక్, అన్‌లాక్, స్టార్ట్ చేయొచ్చు. తాళం పోయిన సందర్భాల్లోనే కాకుండా.. వేరే సమయాల్లోనూ ఈ ఫీచర్‌ను మనం వాడుకోవచ్చు. దీన్నివాడాలంటే ఏదైనా ఆండ్రాయిడ్ డివైజ్ మీ చేతిలో ఉంటే సరిపోతుంది. ఈ ఫీచర్‌పై(Digital Car Key) పూర్తి వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
‘డిజిటల్ కార్ కీ’ ఎలా పనిచేస్తుంది ?
- డిజిటల్ కీ ఫీచర్ అల్ట్రా-వైడ్ బ్యాండ్ అనే టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది మీ దగ్గరున్న ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కారును లాక్, అన్‌లాక్ చేసే వీలును కల్పిస్తుంది.
- డిజిటల్ కార్ కీ ఫీచర్‌ను టెక్ దిగ్గజం యాపిల్ తన డివైజుల్లో 2020లోనే ప్రవేశపెట్టింది.
- గూగుల్ తన అప్డేటెడ్ వెర్షన్లో భాగంగా డిజిటల్ కార్ కీ ఫీచర్‌ను 2021లో ఆండ్రాయిడ్ 12లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
- కారు తాళాలను ఇంట్లోనో లేదా ఆఫీసులోనో మర్చిపోయినప్పుడు డిజిటల్ కారు కీ ఫీచర్‌ను వాడుకోవచ్చు.
- ఈ ఫీచర్‌ను వాడాలంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో డిజిటల్ కారు కీ ఫీచర్‌కు సంబంధించి కొన్ని సెట్టింగ్స్ చేయాలి. ఈ సెటప్ సాయంతోనే మీ కారు డోర్లను లాక్, అన్‌లాక్, స్టార్ చేయగలుగుతారు.
Also Read : Varun Gandhi : వరుణ్ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్.. పార్టీలో చేరే ఛాన్స్ ?
ఈ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో పనిచేస్తుంది
- లేటెస్ట్ శామ్సంగ్ గెలాక్సీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే అందులోని శామ్సంగ్ వాలెట్ సాయంతో ఈ డిజిటల్ కీ ఫీచర్‌ను వాడొచ్చు.
- ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నవారు గూగుల్ వాలెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని డిజిటల్ కార్ కీ ఫీచర్‌ను ఆస్వాదించవచ్చు.
- పిక్సల్ 6 వెర్షన్స్, లేటెస్ట్ పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ ఫోల్డ్, శామ్సంగ్ గెలాక్సీ S21+, ఆపై వచ్చిన మోడల్స్‌లో డిజిటల్ కీ ఫీచర్ పనిచేస్తుంది.
- కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే డిజిటల్ కీ ఫీచర్‌ను తెచ్చాయి.
ఎలా పని చేస్తుంది?
- డిజిటల్ కీ ఫీచర్‌తో కారును లాక్ లేదా అన్ లాక్ చేయడానికి మీ ఫోన్‌ను కారు తలుపుల దగ్గర ఉంచాలి. ఇంజిన్‌ను ఆన్ చేయడానికి మీరు దానిని కారు కీ రీడర్‌పై ఉంచాలి.
- డిజిటల్ కీ ఫీచర్‌లోని యూడబ్ల్యూబీ (నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్ లేదా అల్ట్రా-వైడ్ బ్యాండ్) టెక్నాలజీని మీరు వాడుకుంటే.. జేబులో నుంచి ఫోన్ బయటకు తీయకుండానే కారుకు దగ్గరగా లేదా దూరంగా వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా అన్‌లాక్, లా క్అయిపోతుంది. అంతేకాదు.. కారులోపలికి అడుగుపెట్టగానే కారు కీ రీడర్ సాయం లేకుండానే ఇంజిన్‌ను ఆన్ చేసుకోవచ్చు.
- దారిలో అనుకోకుండా మీ ఫోన్ పోయినా లేదా డ్యామేజ్ అయినా మీ వెంట తీసుకెళ్లే తాళం మీకు ఉపయోగపడుతుంది.
- మీ డిజిటల్ కారు కీ సంబంధించిన యాక్సెస్ వివరాలను మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతోనూ షేర్ చేసుకోవచ్చు.
- మీరు మరింత సేఫ్టీ కోసం Google Wallet సెట్టింగ్స్‌లో పాస్సివ్ ఎంట్రీని టర్న్ ఆఫ్ చేయొచ్చు. డిజిటల్ కార్ కీ కోసం ఓపెన్ చేసే స్క్రీన్కు పాస్వర్డ్స్ లాక్ లాంటివి పెట్టుకోవచ్చు.
Also Read : Bridge Collapse : నౌక ఢీకొట్టడంతో కుప్పకూలిపోయిన బ్రిడ్జి
Related News
Maruti Suzuki Cars: కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి రానున్న మారుతీ మోడల్ కార్లు ఇవే..
నెక్ట్స్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్.. 2024లో భారత మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్ ను ఇ్పటికే జపాన్ లో లాంచ్ చేశారు. భారత్ లో విడుదలయ్యేది స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ మోడల్.