HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Insurance Is Mandatory For Electric Bikes

Vida V2 Evs: వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా అన్ని వేల తగ్గింపు.. సింగల్ ఛార్జ్ తో అన్ని కిలో మీటర్లు ప్రయాణం!

ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాలు తయారీ సంస్థ వీడా ఎలక్ట్రిక్ స్కూటర్ పై అద్భుతమైన బంపర్ ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా ఈ స్కూటర్ ని సొంతం చేసుకోవచ్చు.

  • Author : Anshu Date : 10-04-2025 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vida V2 Evs
Vida V2 Evs

రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో వీటికి ఉన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. వీటికి ఉన్న డిమాండ్ పెరిగిపోవడంతో కంపెనీలకు మధ్య పోటీ కూడా పెరిగింది. కంపెనీల మధ్య మార్కెట్ లో పెరిగిన పోటీ నేపథ్యంలో వాహనాల ధరలు తగ్గుతూ సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. అందులో భాగంగానే కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి వీడా ఎలక్ట్రిక్ గొప్ప శుభవార్త చెప్పింది. వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్లపై పది కాదు, ఇరవై కాదు ఏకంగా రూ.40 వేల వరకూ తగ్గింపును అందిస్తోంది.

కాగా వీడా వీ2 సిరీస్ స్కూటర్లు వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రూ.40 వేల తగ్గింపును ప్రకటించింది. వీటిలో వీడా వీ2 లైట్, ప్లస్, ప్రో అనే మూడు రకాలు ఉన్నాయి. వీడా వీ2 లైట్ అత్యంత తగ్గింపు ధరకు లభిస్తుంది. దీనిలో 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. పూర్తి సింగిల్ చార్జింగ్ పై సుమారు 94 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 69 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీస్తుందట. అయితే ఈ స్కూటర్ రైడ్, ఎకో అనే రెండు రకాల మోడ్ లతో ఆకట్టుకుంటోంది. ఏడు అంగుళాల టీఎఫ్ టీ టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో సహా ఆధునిక ఫీచర్లు బాగున్నాయి.

వీ2 ప్లస్ లోని 3.44 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సుమారు 143 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందట. అలాగే వీ2 ప్రోలో 3.94 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. సింగిల్ చార్జ్ పై 165 కిలో మీటర్ల రేంజ్ వస్తుందట. వీ2 సిరీస్ లోని రెండు మోడళ్లలో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ లు ఉన్నాయి. వీటిని ఆరు గంటల్లో దాదాపు 80 శాతం చార్జింగ్ చేయవచ్చట. ఇకపోతే ప్రత్యేకతల విషయానికి వస్తే.. వీడా వీ2 స్వింగ్ ఆర్మ్ పై అమర్చిన పీఎంఎస్ మోటారుతో శక్తిని పొందుతుందట. దీని నుంచి 6 కేడబ్ల్యూ శక్తి, 26 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుందట. వీ2 ప్లస్, ప్రో మోడళ్లు ఎకో, రైడ్, స్పోర్ట్స్, కస్టమ్ అనే నాలుగు రకాల మోడ్ లను పొందుతాయి. ప్లస్ గరిష్టంగా గంటకు 85 కిలో మీటర్లు, ప్రో 90 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతుందట. కాగా ఈ వీడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగానే వీ2 సిరీస్ వాహనాలు కనిపిస్తాయట. వీటి మధ్య డిజైన్ పరంగా చిన్న తేడాలు మాత్రమే ఉంటాయి. కానీ రెండు కొత్త రంగులైన మాట్టే నెక్సస్ బ్లూ గ్రే, గ్లోసీ స్పోర్ట్స్ రెడ్ లలో ఆకట్టుకుంటున్నాయి. ఐదేళ్లు లేదా 50 కిలో మీటర్ల వారంటీతో కొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. అలాగే బ్యాటర్ ప్యాక్ లు మూడేళ్లు లేదా 30 వేల కిలో మీటర్ల వారంటీతో వస్తాయట. క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ తదితర అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి. వీ2 ఖాతాదారులు దేశవ్యాప్తంగా 250 కంటే ఎక్కువ నగరాల్లో ఉన్న 3100 చార్జింగ్ స్టేషన్ల బ్రాండ్ నెట్ వర్క్ ను యాక్సెస్ చేయవచ్చట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bike insurance
  • electric bike
  • Electric vechile
  • Vida V2 Evs

Related News

    Latest News

    • Pawan Kalyan: ఉస్తాద్‌లో పాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చూస్తామా?

    • Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలు.. అస‌లు ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏమిటీ?!

    • India-US Trade: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశం!

    • Brain Ageing: వయస్సు కంటే ముందే మెదడు వృద్ధాప్యానికి చేరుకుందా?

    • Telangana Global Summit: తెలంగాణ గ్లోబ‌ల్ సమ్మిట్‌.. అస‌లు ఎందుకీ స‌మ్మిట్‌, పూర్తి వివ‌రాలీవే!

    Trending News

      • House Construction: వారికి గుడ్ న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు హోమ్ లోన్!

      • Goa Tour : గోవాకు వెళ్లి యువత జాగ్రత్త..లేదంటే మీరే నష్టపోతారు !!

      • IndiGo Flight Disruptions : ఇండిగో విమానం రద్దుతో కూతురి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు

      • Zero Balance Accounts: బ్యాంక్ అకౌంట్ ఉన్న‌వారికి శుభ‌వార్త చెప్పిన ఆర్బీఐ!

      • Justin Greaves: టెస్టుల్లో గ్రీవ్స్ స‌రికొత్త ప్రపంచ రికార్డు.. నంబర్ 6లో బ్యాటింగ్ చేస్తూ డబుల్ సెంచ‌రీ!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd