Hyundai Creta facelift: త్వరలోనే లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్.. ధర, ఫీచర్స్ ఇవే?
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు చక్కటి శుభవార్తను
- By Nakshatra Published Date - 02:00 PM, Thu - 7 December 23
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు చక్కటి శుభవార్తను చెబుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది హ్యుందాయ్ సంస్థ. 2024 జనవరి 16న ఒక ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈవెంట్ నిర్వహణకు గల కారణాన్ని చెప్పలేదు కానీ ఇందులో క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ని సంస్థ లాంచ్ చేస్తుందని, ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. కాగా హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే చాలాసార్లు జరిగిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో తీసిన ఫొటోలు కొన్ని ఆన్సోషల్ మీడియాలో లో వైరల్ కూడా అయ్యాయి. అయితే ఈ సరికొత్త హ్యుందాయ్ క్రేటా డిజైన్ లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఫ్రెంట్ గ్రిల్‌ని రీడిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా ఫ్రెంట్- రేర్ బంపర్స్, టెయిల్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్ కొత్తగా ఉండవచ్చు. ఇక క్రేటా ఫేస్‌లిఫ్ట్‌లో డాష్‌బోర్డ్, ఏసీ వెంట్స్ డిజైన్ వంటివి కొత్తగా ఉండనున్నాయి. డ్యూయెల్ 10.25 ఇంచ్ స్క్రీన్స్ రాబోతున్నాయి. కొత్త క్రేటాలో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. అడాస్‌తో పాటు 360 డిగ్రీ వ్యూ కెమెరా ఫీచర్ ఇందులో ఉండనుంది.
ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్- అసిస్టెన్స్, రేర్ క్రాస్ ట్రాఫిక్ కొలిషన్ వార్నింగ్- అసిస్టెన్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ వంటివి అడాస్‌లో భాగంగా ఉండనున్నాయి. కాగా ఆల్ న్యూ హ్యుందాయ్ క్రేటా ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10.87లక్షలుగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీని పై హ్యుందాయ్ సంస్థ వివరణ ఇవ్వాల్సి ఉంది.
Related News
UN Apology : భారత్‌కు ఐక్యరాజ్యసమితి క్షమాపణలు.. ఎవరీ వైభవ్ అనిల్ కాలే ?
UN Apology : భారతదేశానికి ఐక్యరాజ్యసమితి క్షమాపణలు చెప్పింది.