HP Omnibook AI: మొట్టమొదటి హెచ్‌పీ ఏఐ ల్యాప్‌టాప్ వచ్చేసింది
- By Kode Mohan Sai Published Date - 05:00 PM, Fri - 25 October 24

హెచ్‌పీ భారతదేశంలో తన మొదటి 2 ఇన్ 1 కృత్రిమ మేథ ఆధారిత ‘ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్’ అనే కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఇది హెచ్‌పీ నుంచి వచ్చిన తొలి ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్ కావడంతో, దీని ప్రత్యేకతలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ లూనార్ లేక ప్రాసెసర్ కోర్ అల్ట్రా సిరీస్ 2 ఉపయోగించబడింది. ఈ ప్రాసెసర్‌లు ఆన్-డివైస్ కృత్రిమ మేథ వర్క్‌లోడ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ని కలిగి ఉంటాయి. అందులోని NPU సెకనుకు 48 ట్రిలియన్ కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది, ఇది వినియోగదారులకు అద్భుతమైన పనితీరు అందిస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ క్వాలిటీ వీడియోలను ఆస్వాదించడానికి అనువైనది, మరియు దాని బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. హెచ్‌పీ యొక్క ఈ కొత్త ల్యాప్‌టాప్ కృత్రిమ మేథను(AI) ఉపయోగించే వినియోగదారుల కోసం ఒక శ్రేష్ఠమైన ఎంపికగా మారబోతోంది.
హెచ్‌పీ తన కొత్త ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్ట్స్ జెన్ ఏఐ పీసీకి ప్రారంభ ధర రూ.1,81,999గా నిర్ణయించింది. ఈ ల్యాప్‌టాప్ ఎక్లిప్స్ గ్రే మరియు అట్మాస్ఫియరిక్ బ్లూ అనే రెండు ఆకర్షణీయ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది భారతదేశంలో హెచ్‌పీ ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు, ఆన్‌లైన్‌లో అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది .
అదే విధంగా, హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్ట్స్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 9 కూడా విడుదలయింది, ఇది రూ.1,91,999 వద్ద అందుబాటులో ఉంది. ఈ మోడల్ మాత్రం అట్మాస్ఫియరిక్ బ్లూ రంగులో మాత్రమే లభించనుంది.
హెచ్‌పీ లాంచ్ చేసిన ఈ కొత్త ల్యాప్‌టాప్‌లను అక్టోబర్ 31వ తేదీకి ముందు కొనుగోలు చేసిన వినియోగదారులు రూ.9,999 విలువైన అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్స్, ప్రైమరీ ఎలిమెంట్స్ వంటి అనేక ఫీచర్లను ఉచితంగా పొందవచ్చు. అలాగే, వినియోగదారులు బజాజ్ ఫైనాన్స్ ద్వారా నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్‌ను ఉపయోగించి కూడా ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కలిగి ఉన్నారు.
ఫీచర్లను పరిశీలించినప్పుడు:
ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 21 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది, ఇందులో 2.8కే ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. వినియోగదారులు దీనిని ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. హెచ్‌పీ తన మొదటి కృత్రిమ మేధ(AI) భద్రతా వ్యవస్థ అయిన హెచ్‌పీ వోల్ఫ్ సెక్యూరిటీని ఇందులో అందించడంతో, ఇది కృత్రిమ మేధతో సృష్టించిన బెదిరింపులు మరియు సైబర్ దాడుల నుండి డివైస్ మరియు డేటాను రక్షిస్తుంది.
అంతేకాకుండా, ఇందులో డీప్‌ఫేక్ డిటెక్టర్ కూడా ఉంటుంది, ఇది డేటాను కాపాడటానికి మరియు ఇతరులు హ్యాక్ చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఓమ్నిబుక్ అల్ట్రా ఫ్లిప్ ఫ్రీలాన్సర్‌ల మరియు కంటెంట్ క్రియేటర్ల ఆధునిక అవసరాలను సులభంగా తీర్చగలదని హెచ్‌పీ ఇండియా పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ తెలిపారు.
మెరుగైన వర్చువల్ సహకారానికి, ఈ పరికరంలో 9 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా మరియు పాలీ ఆడియో సౌకర్యాలు ఉన్నాయి. పాలీ కెమెరా ప్రో, స్పాట్ర్ లైట్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అందిస్తుంది, దీనితో అనేక గుర్తించదగిన ఫీచర్లు ఉన్నాయి. హెచ్‌పీ ఏఐ కంపానియన్ కంటెంట్ విశ్లేషణ మరియు పీసీ ఆప్టిమైజేషన్‌లో సహాయపడుతుంది.
ఈ ల్యాప్‌టాప్ మరింత ఉత్పాదకత మరియు సృజనాత్మక పనుల కోసం కోపైలట్ + పీసీతో ఇంటిగ్రేట్ అవుతుంది. అదేవిధంగా, ఇది 32 జీబీ ర్యామ్ మరియు 64 వాట్స్ బ్యాటరీ (21 గంటల బ్యాటరీ లైఫ్) ను పొంది ఉంది. ఇది వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సౌకర్యాలకు కూడా మద్దతు ఇస్తుంది.