Honda EV Scooter: త్వరలోనే మార్కెట్లోకి హోండా ఈవీ స్కూటర్.. పూర్తి వివరాలు ఇవే?
ప్రముఖ కంపెనీ హోండా యూ-గో పేరుతో ఈవీ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది.
- By Anshu Published Date - 11:15 AM, Wed - 21 August 24

ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ బైక్లు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మార్కెట్లో ఈవీ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ రెండు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్లను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ హోండా యూ-గో పేరుతో ఈవీ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది. అద్భుతమైన ఫీచర్లతో మొదటగా యూ-గో ఈవీ స్కూటర్ ను ప్రకటించింది. మరి ఈ స్కూటర్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
హోండా యూ-గో డిజైన్, ఫీచర్లు ఈవీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్, స్పోర్టీ డిజైన్ ను యువతను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ ఈవీ స్కూటర్ లోని ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టైల్‌లైట్ డిజైన్ ను కలిగి ఉన్న మొదటి బడ్జెట్ స్కూటర్ లలో ఇది ఒకటని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్కూటర్ ఆప్రాన్ ఇతర ఉపయోగకరమైన ఉపకరణాలతో పాటు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. హోండా యూ గో సౌకర్యవంతమైన అండర్ సీట్ స్టోరేజీని కూడా అందిస్తుంది. దాదాపు 26 లీటర్ల వరకు స్టోరేజ్ స్పేస్ ను అందిస్తుంది. కాగా ఈ హోండా యు-గో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హోండా యూ-గో ప్రామాణిక మోడల్ అని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
1.2 కేడబ్ల్యూ నిరంతర రేటెడ్ హబ్ మోటార్ తో వస్తుందట. అలాగే ఈ స్కూటర్ గంటకు 53 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. తక్కువ స్పీడ్ వేరియంట్ 800 డబ్ల్యూ హబ్ మోటార్ తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 43 కిలో మీటర్లు. రెండు వేరియంట్ లు 48వీ, 30ఏహెచ్ రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తాయి. ఈ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 1.44 కేడబ్ల్యూహెచ్, రెండో బ్యాటరీను ఇన్‌స్టాల్ చేస్తే మైలేజ్ 130 కిలో మీటర్లకు పెరగుతుంది. అయితే హోండా యూ-గో భారతదేశంలో ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం క్లారిటీ లేదు. అయితే భారత్‌లో పెరుగుతున్న మార్కెట్ దృష్ట్యా త్వరలోనే భారతదేశంలో ఈ స్కూటర్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఈ స్కూటర్ రూ.91,860 కు లాంచ్ చేసే అవకాశం ఉంది. హోండా యూ-గో ఇటీవలి కాలంలో అత్యుత్తమ సరసమైన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటిగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.