Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ ఫస్ట్ టీజర్ విడుదల.. లాంచింగ్ అయ్యేది అప్పుడే!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా టాటా కర్వ్ ఈవీపై ఒక కీలక అప్డేట్ ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీకి సంబంధించిన మొదటి టీజర్‌ని రివీల్ చేసింది. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై అంచనాలు కూడా మరింత పెరిగాయి.
- By Anshu Published Date - 11:17 AM, Mon - 8 July 24

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా టాటా కర్వ్ ఈవీపై ఒక కీలక అప్డేట్ ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీకి సంబంధించిన మొదటి టీజర్‌ని రివీల్ చేసింది. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై అంచనాలు కూడా మరింత పెరిగాయి. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో కొత్త డిజైన్ ట్రెండ్‌గా భావిస్తున్న ఈ టాటా కర్వ్ ఈవీ కూపే సిల్హౌట్‌ను టీజర్ వీడియోలో చూడవచ్చు. మరి ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. టాటా కర్వ్ ఈవీని మొదటిసారిగా 2022 లో కాన్సెప్ట్ మోడల్ గా ప్రదర్శించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.
ఇకపోతే తాజాగా లాంచ్ అయిన టీజర్ ని చూస్తుంటే కాన్సెప్ట్ వర్షెన్ లోని చాలా భాగాలు ప్రొడక్షన్ వెర్షన్ లో కూడా కనిపిస్తాయని స్పష్టం అవుతోంది. ఈ ఈవీలో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లను టీజర్లో ఆవిష్కరించగా, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ను కాన్సెప్ట్ లో ఇప్పటికీ కూడా ఉంది. కొత్త టాటా కర్వ్ ఈవీ సరికొత్త యాక్టి ఈవీ ప్లాట్‌ఫామ్ పై ఆధారపడి ఉంటుంది. దీనిని ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. టాటా పంచ్ ఈవీ కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన మొదటి మోడల్. నెక్సాన్ ఈవీలో చూసినట్లుగా స్టార్టప్ సీక్వెన్స్ కోసం యానిమేటెడ్ లైట్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ టాటా కర్వ్ ఈవీ ఫీచర్ల విషయానికి వస్తే..
ఈ టాటా కర్వ్ మొదట ఈవీగా బయటకు వస్తుంది. అనంతరం ఐసీఈ ఇంజిన్‌తో కూడిన మోడల్ లాంచ్ అవుతుంది. సాధారణంగా ఎప్పుడు ఐసీఈ మోడల్ ని లాంచ్ చేస్తుంది టాటా మోటార్స్. ఇక ఈ టాటా కర్వ్ ఈవీ కూపే ఎలక్ట్రిక్ ఎస్యూవీ లో 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్లు ఉండనున్నాయి. 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ తో పాటు 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వీ2ఎల్ కెపాసిటీ, లెవల్ 2 ఏడీఏఎస్ తదితర ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. టాటా కొత్తదనం విలువను పెంచడానికి అనేక కొత్త ఫీచర్లను తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇకపోతే ఈ టాటా ఈవి కారు ధర విషయానికి వస్తే.. ఇది రూ. 20 లక్షలుగా ఉంది.