Elon Musk: పాపం ఎలాన్ మస్క్…లక్షల కోట్లు నష్టపోతున్నాడు..కారణం ఏంటో తెలుసా..?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కంటినిండా నిద్ర కరువైంది.రోజుకో సమస్యతో సతమతమవుతున్నాడు. మస్క్ కలలు కన్న టెస్లా కంపెనీ నష్టాలను చవిచూస్తోంది.
- By Bhoomi Published Date - 05:07 PM, Thu - 23 June 22

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కంటినిండా నిద్ర కరువైంది.రోజుకో సమస్యతో సతమతమవుతున్నాడు. మస్క్ కలలు కన్న టెస్లా కంపెనీ నష్టాలను చవిచూస్తోంది. బిలియనీర్ సంపద నీళ్లలా ఖర్చు చేస్తోంది. కొత్త టెస్లా గిగా ఫ్యాక్టరీలు మస్క్ కు టెన్షన్ పెట్టిస్తున్నాయి. సంపదను అమాంతం ఊడ్చేస్తున్నాయి. చైనాలో బ్యాటరీల కొరత, సరఫరా అంతరాయాల కారణంగా జర్మనీ, అమెరికాలో టెస్లా కొత్త ఫ్యాక్టరీలు బిలియన్ల కొద్దీ డాలర్లను కోల్పోతున్నాయని మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బిలియనీర్ కు సంబంధించిన టెక్సాస్ లోని బెర్లిన్, ఆస్టిన్ లోని టెస్లా కార్ల తయారుదారు ప్లాంట్స్ పెద్ద డబ్బు కొలిమిలుగా మారాయనని ఆందోళన చెందుతున్నారు. ఇవి భారీ మొత్తంలో సంపదను ఆవిరిచేస్తూన్నాయని చెప్పారు. టెస్లా భారీ కర్మాగారం ఉన్న షాంఘైలోనూ పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయట. ఈ ఏడాది చైనాలోని కోవిడ్ లాక్ డౌన్ తయారీదారులకు పనిచేయడం కష్టతరంగా మార్చడంతో చిక్కులు వచ్చాయి. దీంతో ఎలాన్ మస్క్ ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయ్యారు. ఈ వారంలోపదిశాతం ఉద్యోగుల కోత ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
మస్క్ ఆందోళన అంతా కూడా బెర్లిన్, ఆస్టిన్ కర్మాగారాలపైన్నే ఉంది.ఈ రెండు కంపెనీ డబ్బును భారీగా ఖర్చు చేస్తున్నాయి. ప్లాంట్లు ప్రస్తుతం బిలియన్ డాలర్లను కోల్పోతున్నాయని మస్క్ అన్నారు. ఒక టన్ను ఖర్చుకు ఎలాంటి అవుట్ ఫుట్ లేదని టెస్లా ఓనర్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ చెప్పుకొచ్చారు. ఇక గిగా ఫ్యాక్టీరీలు ప్రొడక్టును పెంచేందుకు కష్టపడుతున్నట్లు తెలిపారు. షాంఘై ఫ్లాంట్ ను మసివేయడం టెస్లాకు చాలా కష్టం కలిగిస్తోందని చెప్పారు. టెస్లా ఆర్థిక వ్యవస్థ గురించి సూపర్ బ్యాడ్ ఫీలింగ్ ఉన్నట్లు మస్ గతవారం ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Related News

OLA EV : నాల్గవ స్థానానికి పడిపోయిన ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ రిజిస్ట్రేషన్లు
ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి. జూన్ నెలలో ఈ బైక్స్ రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయింది. ఇటీవల కాలంలో ఈ బైకులు అగ్నిప్రమాదాలకు గురవుతుండటంతో చాలామంది వాహనదారులు వీటిని కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ నాల్గవ స్థానానికి పడిపోయింది. భవిష్ అగర్వాల్ నడుపుతున్న ఓలా ఎలక్ట్రిక్ 5,869 ఎలక్ట్రిక్ స్కూటర్ల రిజి