Elon Musk: ఎలాన్ మస్క్ ని ఆ కార్ల కంపెనీ భయపెడుతోందా.. ఇందులో నిజమెంత?
ప్రముఖ ఈవీ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది టెస్లా కంపెనీ.
- By Nakshatra Published Date - 07:40 PM, Wed - 31 May 23
![Elon Musk: ఎలాన్ మస్క్ ని ఆ కార్ల కంపెనీ భయపెడుతోందా.. ఇందులో నిజమెంత?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/05/Elon-Musk.jpg)
ప్రముఖ ఈవీ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది టెస్లా కంపెనీ. ఇది ఇలా ఉంటే టెస్లా కంపెనీ ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్‌ను భయపెడుతోందా? అందుకే టెస్లా కార్లకు పోటీగా సదరు కంపెనీ ఉందని ఎలాన్ మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2022లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అత్యదికంగా అమ్ముడు పోయిన బ్రాండ్ల జాబితాలో టెస్లా సంస్థ తొలిస్థానాన్ని దక్కించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ముందంజలో ఉన్న టయోటా, హోండా వంటి దిగ్గజ కంపెనీల కార్లను సైతం వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఎలాన్ మస్క్ చైనాకు చెందిన ఒక సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లు టెస్లా కార్లకు, బ్రాండ్‌ను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని మస్క్ భావిస్తున్నారట? 12 ఏళ్ల క్రితం బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి ఎలాన్ మస్క్‌ను చైనా ఈవీ కార్ల తయారీ సంస్థ బీవైడీ వాహనాల తయారీ, కార్ల డిజైన్ గురించి మస్క్‌ను ప్రశ్నించారు. ఆ కార్ల కంపెనీ గురించి తనని ప్రశ్నించడాన్ని మస్క్ జోక్‌గా తీసుకున్నారు. పెద్దగా నవ్వి ఊరుకున్నారు.
అందుకు సదరు యాంకర్ ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగగా ఆ ప్రశ్నకు సమాధానంగా మీరు బీవైడీ కార్లు ఎలా ఉన్నాయో చూశారా? తన కార్లకు బీవైడీ కార్లు పోటీకాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు బీవైడీ కార్లపై తనకున్న అభిప్రాయాన్ని మస్క్ మార్చుకున్నారంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో టెస్లాకు అతిపెద్ద ఛాలెంజర్ ఏ కార్ల తయారీ సంస్థ అని అడిగినప్పుడు మస్క్ చైనా కంపెనీ అని మస్క్ తెలిపారు. కానీ సదరు కంపెనీ పేరు మాత్రం వెల్లడించలేదు. వారు కష్టపడి, తెలివిగా పని చేస్తున్నారు. నేను ఊహించినట్లే చైనాకు చెందిన ఏదైనా కంపెనీ ఈవీ విభాగంలో టెస్లా తర్వాత రెండవ స్థానంలో ఉంటుందని తెలిపారు. ఆయన మాటల్ని ఊటంకిస్తూ ఎలాన్ మస్క్‌కు బీవైడీ కార్ల భయం పట్టుకుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Elon Musk On Microsoft: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ పై ఎలాన్ మస్క్ ట్రోలింగ్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/19_07_2024-elon_musk_on_microsoft_23761482_m_11zon.png)
Elon Musk On Microsoft: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ పై ఎలాన్ మస్క్ ట్రోలింగ్
మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ పై ఎలాం మస్క్ ఆసక్తికరంగా స్పందించారు. ఒకవిధంగా మస్క్ మైక్రోసాఫ్ట్ ని ట్రోల్ చేసినట్టే అనుకోవాలి. మస్క్ X హ్యాండిల్లో ఒక ఫోటోని పంచుకున్నారు