Top Selling Cars: 2023లో అత్యధికంగా అమ్ముడైన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే?
ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఒకదాన్ని మించి మరొకటి అద్భుతమైన ఫీచర్స్ తో వినియోగ
- By Anshu Published Date - 06:00 PM, Mon - 1 January 24

ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఒకదాన్ని మించి మరొకటి అద్భుతమైన ఫీచర్స్ తో వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అలా 2023లో అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి విడుదల అవ్వగా అందులో కేవలం కొన్ని మాత్రమే అత్యధికంగా అమ్ముడై రికార్డులు సృష్టించాయి. మరి 2023లో అత్యధికంగా అమ్ముడైన ఆ ఎలక్ట్రిక్ కార్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టాటా నెక్సన్ ఈవీ.. భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటి. దీనిలో 40.5కేడబ్ల్యూహెచ్ హై ఎనర్జీ డెన్సిటీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని చార్జింగ్ సమయం ఆరు గంటలు. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే చాలు 465 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ వాహనం 9 సెకన్లలోపే గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని ధర రూ. 14.7 లక్షల నుంచి రూ. 19.9 లక్షలుగా ఉంటుంది.
సిట్రోయెన్ ఈసీ3… ఈ కారు ధర రూ. 11.61లక్షల నుంచి రూ. 12.79లక్షలు ఉంటుంది. దీనిలోని బ్యాటరీ సామర్థ్యం 29.2కేడబ్ల్యూహెచ్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 320కిలోమీటర్ల రేంజ్ ను కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవడానికి కనీసం 10 గంటల సమయం తీసుకుంటుంది. అదే డీసీ సాకెట్ అయితే 57 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఇది 6.8 సెకండ్లలోనే 0 నుంచి 60కిమీ వేగాన్ని అందుకోగలగుతుంది.
హ్యుందాయ్ ఐయోనిక్ 5.. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ నుంచి వచ్చిన ఐయానిక్5 ధర రూ. 45.95 లక్షలుగా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 72.6 కేడబ్ల్యూహెచ్ గా ఉంది. ఇది సింగిల్ చార్జ్ పై గరిష్టంగా 631 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఈ వాహనం కేవలం 7.6 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలగుతుంది. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది.
ఎంజీ కామెట్ ఈవీ.. ఎంజీ మోటార్స్ నుంచి కామెట్ ఈవీ మన దేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. దీని ధర రూ. 7.98 గా ఉంది. ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ కెపాసిటీ 17.3 కేడబ్ల్యూ, సింగిల్ చార్జ్ పై 230 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఇది ఫుల్ చార్జ్ అవడానికి 5.5 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400.. మహీంద్రా నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ వాహనం ధర 15.99 లక్షల నుంచి19.19 లక్షలుగా ఉంటుంది. దీనిలో రెండు వేరియంట్లు ఎక్స్ యూవీ400ఈసీ, ఎక్స్ యూవీ400 ఈఎల్ ఉన్నాయి. వీటి బ్యాటరీ సామర్థ్యాలు 34.5కేడబ్ల్యూహెచ్, 39.4 కేడబ్ల్యూహెచ్ ఉంటుంది. దీనిని ఫుల్ చార్జ్ చేస్తే 375-456 కి.మీ దూరం ప్రయాణించగలగుతుంది.