Summer Hacks : వేసవిలో చల్లగా ప్రయాణించాలా..? మీ కారులో ఇవి తప్పనిసరి..!!
ఎండాకాలం వచ్చేసింది. చాలా మంది తమ కార్లను ఆరుబయటే పార్క్ చేస్తుంటారు.
- By Hashtag U Published Date - 11:50 AM, Thu - 31 March 22

ఎండాకాలం వచ్చేసింది. చాలా మంది తమ కార్లను ఆరుబయటే పార్క్ చేస్తుంటారు. ఎండలో కారు ఎక్కువసేపు పార్క్ చేస్తే…కారు లోపలి వాతావరణం తక్కువ సమయంలోనే ఎక్కువగా వేడిగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దూరప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడం మంచిది కాదు. కానీ అత్యవసర ప్రయాణాలను మాత్రం నివారించలేము. కాబట్టి ఇలాంటి సమయంలో మన కార్లలో కొన్ని కీలకమైన యాక్ససరిస్ లు ఉండటం చాలా అవసరం. అవేంటో చూద్దాం.
సన్ షేడ్స్….
రోడ్లపై తిరిగే కార్లకు నల్లటి సన్ ఫ్లిమ్ ఉపయోగించడాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. వింటో టింటింగ్ కారణంగా బయటి వేడి లోపలికి ప్రవహించకుండా…కారు లోపల ఏసీ త్వరగా వ్యాపించేస్తుంది. మనదేశంలో కారు అద్దాలకు సన్ ఫిల్మ్ వాడడం నిషేధం కాబట్టి…దీనికి చక్కటి ప్రత్యామ్నాయం మార్కెట్లో లభించే సన్ షేడ్స్ లేదా సన్ కర్టెన్స్ మొదలైనవి. ఎండలో రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు బయట నుంచి వచ్చే సూర్యకిరణాలు వేడిని అడ్డుకునేందుకు ఈ సన్ షేడ్స్ ఉపయోగపడతాయి. క్వాలిటీ సన్ షేడ్స్ ఉపయోగించడం వల్ల కారు క్యాబిన్ వేడెక్కడం తగ్గుతుంది. వేసవి కాలం కార్లలో ప్రయాణించేటప్పుడు ఈ యాక్ససరీ తప్పనిసరిగా మీ కారులో ఉండేలా చూసుకోండి. కొన్ని ప్రీమియం కార్లలో కంపెనీలే ఇలాంటి ఫీచర్లను స్టాండర్డ్ గా అందిస్తాయి.
నెక్ రెస్ట్ లు, లంబార్ పిల్లో…
ఎండాకాలంలో ప్రయాణాలు చాలా కంపరంగా అనిపిస్తాయి. అంతేకాదు తొందరగా అలసిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా కారులో నిటారుగా కూర్చుని ఎక్కువ సమయం వాహనాన్ని నడుపుతున్నప్పుడు మెడ, నడుము ప్రాంతాల్లో నొప్పిగా ఉంటుంది. విశ్రాంతి లేకుండా ప్రయాణం చేస్తే…తొందరగా అస్వస్థతకు గురవుతారు. ఈ సమస్యకు పరిష్కారం ఆప్టర్ మార్కెట్ యాక్ససరీస్ రూపంలో లభిస్తాయి. మెడ నరాలకు విశ్రాంతినిచ్చేందుకు నెక్ పిల్లోస్, వెన్నుకు సపోర్ట్ ఇచ్చేందుకు లంబార్ సపోర్ట్ పిల్లోస్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. దూరప్రయాణాల్లో ఈ పిల్లోస్ మెడ, నడుముకు హాయినిస్తాయి.
కారు పెర్ఫ్యూమ్….
వేసవిలో చెమటలు పట్టడం సాధారణం. మండే సూర్యుడి కారణంగా మన శరీరం విపరీతంగా చెమటపడుతుంది. కారులో ప్రయాణించేటప్పుడు…ఇలాంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇందుకు చక్కటి పరిష్కారం కారు పెర్య్ఫూమ్. కారులో మంచి సువాసన వెదజల్లేటువంటి ఫెర్య్ఫూమ్స్ ఉంటే…ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ సువాసనలు మీ మనస్సును రీఫ్రెష్ గా ఉంచుతాయి.
స్మార్ట్ కూలెంట్స్…
ఎండాకాలంలో మీరొక్కరే చల్లగా ఉంటే సరిపోదు. కారు కూడా చల్లగా ఉండాలి. వేసవిలో కారు ఇంజన్ ను చల్లగా ఉంచడం అవసరం. సాధారణంగా ఇంజన్లు ఎక్కువ వేడిని విడుదల చేస్తుంటాయి. కానీ వేసవి కాలంలోబయటి వేడి కారణంగా మరింత వేడి ఉంటుంది. కాబట్టి ఈ సమ్మర్ లో మీ కారు ఇంజన్ను చల్లగా ఉంచేందుకు అందులో కూలెంట్ ఉండేలా చూసుకోవాలి. వేసవి కోసం ప్రత్యేకమైన స్మార్ట్ కూలెంట్స్ అందుబాటులో ఉన్నాయి.
కారు కవర్….
ఈ సమ్మర్ సీజన్లో మీ కారుకు అవసరమైన అతి ముఖ్యమైన యాక్ససరీస్ లో కారు కవర్ కూడా ఒకటి. కారు పార్క్ చేసిన తర్వాత దానిని కవర్ తో కప్పడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కారు బయటి పెయింట్ ను కాపాడటంలో సహాయపడుతుంది. కారు పై దుమ్ము ధూళి చేరడాన్ని నిరోధిస్తుంది. ఎండల కారణంగా క్యాబిన్ వేడెక్కకుండా చూస్తుంది. కాబట్టి పైన చెప్పినట్లుగా సమ్మర్ లో కారు ప్రయాణాలు చేసేటప్పుడు ఇవి తప్పనసరిగా ఉపయోగించి…మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మలుచుకోండి.