Electric Cars: మార్కెట్ లో ఉన్న టాప్ 4 ఎలక్ట్రిక్ కార్స్ ఇవే.. టాప్ లో ఆ కార్!
ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈవీ కారు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన టాప్ కార్లకు పోటీని ఇస్తూ టాప్ లో నిలిచింది.
- By Anshu Published Date - 11:00 AM, Mon - 12 August 24

ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. వాహన వినియోగదారులు కూడా ఎక్కువగా ఈవీ వాహనాలను ఇష్టపడుతున్నారు. దీంతో వాహన తయారీ సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే చాలా రకాల ఈవీ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు ఒకదానిని మించి ఒకటి అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. మరి మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ లో టాప్ ఎలక్ట్రిక్ కార్స్ ఏవో, అందులో టాప్ వన్ లో ఏది ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టాటా కర్వ్ ఈవీ ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఈ కొత్త ఈవీలో 45 కేడబ్ల్యూహెచ్, 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. 45 డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 502 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే 55 డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 585 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. రెండు వేరియంట్‌లు ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ లను కలిగి ఉన్నాయి. అయితే చిన్న బ్యాటరీ ప్యాక్ 150 పీఎస్ ఉత్పత్తి చేస్తుంది, పెద్దది 167పీఎస్ చేస్తుంది. రెండు వేరియంట్లు ఒకే 215ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనిలో వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ చేసిన కార్ టెక్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 320వాట్ల 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, స్టార్ట్-స్టాప్ బటన్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఉన్నాయి. డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పనోరమిక్ సన్‌రూఫ్, మోటరైజ్డ్ టెయిల్‌గేట్ అదనపు సౌకర్యాలలో ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హోల్డ్‌తో కూడిన ఆటోమేటెడ్ పార్కింగ్ బ్రేక్, లెవెల్-2 అడాస్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇకపోతే ఈ టాటా ఈవీ ధర విషయానికి వస్తే.. ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షలుగా ఉంది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ.. విషయానికి వస్తే ఇందులో 177పీఎస్, 280ఎన్ఎం టార్క్‌ను అందించే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ తో జత చేసిన 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 461కిమీల రేంజ్ ను ఇస్తుంది. ఈసీ ప్రో 34.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఈఎల్ ప్రో 39.4డబ్ల్యూహెచ్ యూనిట్ తో వస్తుంది. సింగిల్ చార్జ్ పై 375కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే రెండోది 456కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. రెండు బ్యాటరీ ప్యాక్‌లతో జత చేసిన ఎలక్ట్రిక్ మోటార్ అదే 150పీఎస్, 310ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవ్ మోడ్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో వస్తుంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ రూ. 18.98 లక్షల నుంచి రూ. 25.44 లక్షల మధ్య ఉంటుంది.
ఇకపోతే మహీంద్రా ఎక్స్‌యూవీ400 విషయానికి వస్తే.. దీనిలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అడ్రోనోక్స్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రెండు యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్లు, పుష్ స్టార్ట్/స్టాప్ స్విచ్, ఓటీఏ అప్‌డేట్‌లు, వెనుక ఎయిర్ వెంట్‌లను పొందుతుంది. ఓసీపీఐ హబ్ ఇంటిగ్రేషన్, ఇన్-బిల్ట్ అమెజాన్ అలెక్సా అసిస్టెంట్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఫాగ్ లైట్లు ఉంటాయి. అడ్రెనోక్స్ పరిచయంతో 55కి పైగా కనెక్ట్ చేసిన కార్ ఫీచర్లను అందిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 రూ. 14.49 లక్షల నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది.
టాటా నెక్సాన్ ఈవీ విషయానికి వస్తే.. ఈ కారు క్యాబిన్‌కు సరికొత్త రూపాన్ని అందించారు. అలాగే ఆల్ ఎల్ఈడీ లైటింగ్, రెండు చివర్లలో ఫుల్ లెంగ్త్ లైట్ బార్‌లు, ఓటీటీ యాప్, గేమ్ సపోర్ట్‌తో కూడిన 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, తొమ్మిది-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ హే టాటా వాయిస్ అసిస్టెంట్, టెలిమాటిక్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, అప్‌గ్రేడ్ చేసిన జెడ్ కనెక్ట్ యాప్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షలు నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉండనుంది.